అధికారం లేనప్పుడే సొంతంగా మధ్యాహ్న భోజనం అమలు చేసిన మంత్రి
ఆచంటకొంతమంది పార్టీలకతీతంగా ప్రజాభిమానాన్ని చూరగొనే నాయకులుంటారు. తాజా మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథ రాజు గారు అలాంటి వ్యక్తే.
అధికారంలో ఉన్నా లేకపోయినా ఆపద్భాంధవుడిగానే పేరుంది పశ్చిమగోదావరి జిల్లాలో ఒక ఏరియాలో ఈయనకి. గతేడాది ఏడ్రోజులపాటు ఆగకుండా కురిసిన వర్షాలకు ఆచంట చుట్టుపక్కల లంకగ్రామాలన్నీ మునిగిపోతే అందరికంటే ముందుగా స్పందించింది ఈయనే.జనాన్ని రెస్క్యూ చేసి ఆ పార్టీ ఈ పార్టీ అని కాకుండా ఒక్కొక్కళ్ళకి పదిహేనుకేజీల బియ్యం పంచాడీ అన్నదాత.
అయోధ్యలంకని దత్తత తీసుకుని వాటర్ ట్యాంక్ కట్టించి సొంతంగా డాక్టర్లని, టీచర్లని కూడా పెట్టారు. చుట్టుపక్కల గ్రామాల గురించి కలెక్టర్లతో ఎప్పుడూ గొడవే ఈయనకి.. అది కావాలి ఇది కావాలి అని. ఇప్పుడు మంత్రి అయినందుకు సంతోషం… జనానికి మంచి జరిగితే చాలు.
Source FB