రెండు కోర్టులు – మూడు షాకులు… రోజా సెటైర్లు!

స్కిల్‌ డెవలప్‌మెంట్ కేసులో చంద్రబాబు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ పై ఈ రోజు సంచలన తీర్పు వెలువడింది. ఈ పిటిషన్ పై ఇరుపక్షాల వాదనలు విన్న హైకోర్టు ఆ క్వాష్ పిటిషన్ ను కొట్టివేస్తూ తీర్పు వెలువరించింది. దీంతో చంద్రబాబుకు ఇది బిగ్ షాక్ అని అంటున్నారు పరిశీలకులు. ఈ సందర్భంలో ఏపీ మంత్రి రోజా మైకులముందుకు వచ్చారు.

అత్యంత ఉత్కంఠగా ఎదురుచూసిన క్వాష్ పిటిషన్ పై తీర్పును ఈ రోజు హైకోర్టు వెలువరించింది. ఈ సందర్భంగా ఆ పిటిషన్ ను కొట్టివేస్తూ కోర్టూ తీర్పునిచ్చింది. దీంతో… ఈ రోజు హైకోర్టు తీర్పుతోనైనా టీడీపీ శ్రేణులు కళ్లు తెరుచుకోవాలని అంటున్నారు ఏపీ మంత్రి రోజా. నిన్నటిదాకా స్కిల్‌ స్కాంపై ప్రభుత్వం దగ్గర ఆధారాలే లేవన్న టీడీపీ నేతలు.. చంద్రబాబు క్వాష్ పిటిషన్‌ను కొట్టివేస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై ఇప్పుడు ఏం చెబుతారని ప్రశ్నించారు.

ఇదే సమయంలో… స్కిల్ డెవలప్‌మెంట్ స్కాంపై సభలో చర్చించకుండా టీడీపీ ఎమ్మెల్యేలు తప్పించుకున్నారని రోజా విమర్శించారు. ఇదే సమయంలో స్కిల్ డెవలప్ మెంట్ స్కాం ఒకటే కాదని చెప్పిన రోజా… ఇంకా ఫైబర్ గ్రిడ్ స్కాం గురించి కూడా చర్చించ డానికి తాము సిద్ధంగా ఉన్నామని తెలిపారు.

ఇదే సమయంలో అమరావతిలో వర్షపు నీరు కారేలా కట్టిన బిల్డింగులపైన అయినా చర్చకు సిద్ధమని రోజా తెలిపారు. అదేవిధంగా అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన మెంట్ పై డిస్కషన్ చేయడానికూడా తాము రెడీగా ఉన్నామని ఆమె తెలిపారు. ఇదే సమయంలో రెయిన్ గన్ లు, చంద్రన్న తోఫాపైనా చర్చకు తామి సిద్ధమని రోజా స్పష్టం చేశరు.

కాగా… టీడీపీ అధినేత చంద్రబాబుకు శుక్రవారం ఒకే రోజు రెండు కోర్టుల్లో మూడు ఎదురుదెబ్బలు తగిలాయి. స్కిల్ డెవలప్‌‌మెంట్ స్కాం కేసులో బాబు జ్యుడిషియల్ కస్టడీని మరో రెండు రోజులు పొడిగిస్తూ ఏసీబీ కోర్టు తీర్పు ఇచ్చింది. అలాగే ఈ కేసులో చంద్రబాబుని ప్రశ్నించేందుకు తమ కస్టడీకి అప్పగించాలంటూ సీఐడీ అభ్యర్థనపై సానుకూలంగా స్పందిస్తూ… రెండు రోజుల అనుమతిస్తూ తీర్పు ఇచ్చింది. మరోవైపు ఈ కేసులో చంద్రబాబు దాఖలు చేసుకున్న క్వాష్ పిటిషన్‌ ను ఏపీ హైకోర్టు కొట్టివేసింది.