పీవీ రమేష్ పై “మెగా” ఆగ్రహం… సంచలన నిర్ణయం!

స్కిల్ డెవలప్ మెంట్ స్కాం కేసులో భాగంగా… ఏపీ రాజకీయాల్లో తీవ్ర కలకలం రేగిన సంగతి తెలిసిందే. రాజకీయంగా కూడా ఈ వ్యవహారం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఈ సమయంలో పీవీ రమేష్ వ్యవహారం ఆసక్తికరంగా మారింది. దీంతో ఆయనను ఉద్యోగ్యం నుంచి తొలగించారని తెలుస్తుంది. ఇదే సమయంలో ఈయన తన సోదరుడి కోసం అమలాపురం టీడీపీ ఎంపీ టిక్కెట్ కూడా ఆశిస్తున్నారని కథనాలొస్తున్నాయి.

మాజీ ఐఏఎస్ అధికారి పీవీ రమేష్ ఇటీవల కాలంలో రాజకీయ వ్యవహారాల్లో జోక్యం చేసుకుని మరింత వివాదాస్పదమవుతున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా… చంద్రబాబు అరెస్ట్ ను ఖండించే విషయంలో టీడీపీ నేతలు, కార్యకర్తలు, ఆ పార్టీ అనుకూల మీడియాను సైతం తలదన్నేస్థాయిలో ఈయన వ్య్యాఖ్యలు ఉన్నాయనే కామెంట్లు వినిపిస్తున్నాయి.

పైగా… ఒక మాజీ ఐఏఎస్ అధికారి అయ్యి ఉండి, ఈ స్కాం జరిగినప్పుడు కీలకమైన బాధ్యతల్లో ఉన్న ఈయన… ఇప్పుడు తాజాగా సరైన ఆధారాలు లేకుండానే సీఐడీ కేసు నమోదు చేసిందని, చంద్రబాబుని బాధ్యుడిని చేస్తే రాజకీయ వ్యవస్థ కుప్పకూలుతుందని, ఏ ఆధారాలతో ఆయన్ను అరెస్ట్ చేశారంటూ ప్రశ్నించారు. దీంతో కాస్త ఎక్కువగానే మాట్లాడుతున్నారనే కామెంట్లు వినిపించాయి.

ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే… అధికారులు తప్పులు చేస్తే చంద్రబాబుని బాధ్యుడిని చేయడం ఏమిటనేది ఈయన లాజిక్ అంట. దీంతో… ఒకవేళ ఆయన చెప్పిందే నిజమైతే.. చంద్రబాబు బదులుగా అధికారుల్నే బాధ్యుల్ని చేయాల్సి వస్తే.. అప్పటి ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి ఉన్నది ఈ పీవీ రమేష్! అంటే… ఈయన్ని కూడా బాధ్యుడిని చేయలని ఆయనే కోరుకుంటున్నట్లున్నారు!

ఆ సంగతి అలా ఉంటే… గతంలో సుజనా చౌదరి ఆర్థిక వ్యవహారాలన్నీ చూసిన పీవీ రమేష్.. ఉద్యోగం నుంచి రిటైరయిన తర్వాత “మేఘా ఇంజినీరింగ్” సంస్థలో సలహాదారుగా చేరారు. అయితే అన్ని పార్టీలకు సమాన దూరంలో ఉండే మేఘా యాజమాన్యం… రమేష్ వ్యవహారంపై సీరియస్ గా రియాక్ట్ అయ్యిందంట.

ఇందులో భాగంగా… తమ సంస్థలో సలహాదారుగా ఉద్యోగం చేస్తూ ఉండి, ఇంత వివాదాస్పద వ్యక్తిగా తయారవ్వడం ఏమిటనే ఆలోచనతోనో ఏమో కానీ… ఈరోజు నుంచి తమ ఆఫీస్ కి రావొద్దని రమేష్ కు చెప్పినట్లు తెలుస్తుంది. దీంతో.. ఈ వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది.