సీఎం జగన్ ‌పై చిరు ప్రశంసలు .. బర్త్ డే రోజు స్పెషల్ ట్విట్

ap cm ys jagan delhi tour

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి . ఈ సందర్భంగా శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. రాజకీయ ప్రముఖుల నుంచి సినీ సెలబ్రిటీలంతా సీఎంకు విషెస్ చెబుతున్నారు. తాజాగా మెగాస్టార్ చిరంజీవి… జగన్‌కు బర్త్ డే విషెస తెలిపారు. సోషల్ మీడియా వేదికగా ఆయన ముఖ్యమంత్రికి శుభాకాంక్షలు తెలిపారు.

ఈ సందర్భంగా జగన్‌ పై చిరు ప్రశంసలు కురిపించారు. ‘ డైనమిక్ యువ నాయకుడు వైఎస్‌ జగన్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు. మీ సంకల్పాన్ని, లక్ష్యాలను గ్రహించడంలో మీ పట్టుదల నిజంగా ప్రశంసనీయం. మీకు మరింత అద్భుతమైన భవిష్యత్తు ఉంది. మీరు మరిన్ని రోజులు ప్రజలకు ఈ విధంగా సేవా చేయాలని కోరుకుంటున్నా’ అంటూ చిరు ట్విట్టర్ వేదికగా శుభాకాంక్షలు తెలిపారు.

మరోపక్క, జగన్‌కు తెలంగాణ మంత్రి కేటీఆర్ కూడా శుభాకాంక్షలు తెలిపారు. ‘గౌరనీయులైన ఏపీ ముఖ్యమంత్రి జగన్ గారికి జన్మదిన శుభాకాంక్షలు. మీరు ప్రజాసేవలో ఉంటూ, ఎల్లప్పుడు ఆరోగ్యంతో, ప్రశాంతంగా ఉండాలని కోరుకుంటున్నాను అన్నా’ అంటూ కేటీఆర్ ట్వీట్ చేశారు.