Manchu Family: ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎంతో మంది సినీ సెలబ్రిటీలు వైకాపా పార్టీకి గుడ్ బై చెబుతూ కూటమి ప్రభుత్వంలోకి అడుగుపెడుతున్న విషయం మనకు తెలిసిందే. ఇకపోతే తాజాగా మంచు కుటుంబం కూడా తెలుగుదేశం పార్టీలోకి చేరుతున్నారని తెలుస్తుంది. మంచు కుటుంబానికి సినిమా ఇండస్ట్రీలో మంచి పేరు ఉంది అయితే రాజకీయాలలో కూడా మంచు మోహన్ బాబు ఎంతో కీలక పాత్ర పోషించారు.
ఈయన సీనియర్ ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనే తెలుగుదేశం పార్టీలోకి చేరి అనంతరం రాజ్యసభ సభ్యుడిగా కూడా ఎంపికయ్యారు అయితే 1995లో మోహన్ బాబు యూటర్న్ తీసుకొని చంద్రబాబు వైపు వచ్చారు .అలాగే మరోసారి చంద్రబాబు నాయుడుకి గుడ్ బై చెబుతూ బిజెపికి మద్దతు పలికారు. అనంతరం 2019వ సంవత్సరంలో ఏపీలో వైకాపా అధికారంలోకి రావడంతో జగన్ సమక్షంలో వైకాపాలు చేరారు.
ఇక ప్రస్తుతం ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలో ఉండటంతో మంచు కుటుంబం తిరిగి తెలుగుదేశం పార్టీలోకి రాబోతుందని తెలుస్తుంది. ఇలా ఏ పార్టీ అధికారంలోకి ఉంటే ఆ పార్టీ చెంతకు మంచు కుటుంబం వెళ్తుంది అనే విమర్శలు కూడా ఉన్నాయి. ఈ క్రమంలోనే ఇటీవల మంచు విష్ణు ఏపీ మంత్రి నారా లోకేష్ ను కలిసిన విషయం తెలిసిందే. అయితే ఇలా వీరిద్దరి భేటీకి కారణమేంటి అనే విషయం తెలియదు కానీ మంచు కుటుంబం మాత్రం తెలుగుదేశం పార్టీలోకి వెళ్ళబోతున్నారని వార్తలు మాత్రం హల్చల్ చేస్తున్నాయి.
ఇక ఎన్నికల సమయంలో కూడా మంచు మనోజ్ కూటమి ప్రభుత్వానికి మద్దతుగా సోషల్ మీడియాలో పోస్టులు చేసిన సంగతి తెలిసిందే. ఇక తిరుపతి లడ్డు వివాదంలో కూడా ఈయన వైకాపా పై విమర్శలు చేస్తూ పోస్టులు చేశారు. ఇక మంచు మనోజ్ భార్య భూమ మౌనిక రెడ్డి కుటుంబం కూడా తెలుగుదేశం పార్టీకి ప్రాతినిధ్యం వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే మంచు కుటుంబం తిరిగి టిడిపి చెంతకి వెళ్ళబోతున్నారని వార్తలు వినపడుతున్నాయి.