Mahanadu: కడపలో మహానాడు నిర్వహించడానికి అదే కారణం…ఇక జగన్ పని అయిపోయినట్టేనా?

Mahanadu: తెలుగుదేశం పార్టీ నిర్వహించే అతిపెద్ద కార్యక్రమాలలో మహానాడు కార్యక్రమం ఒకటి. ఈ కార్యక్రమాన్ని ప్రతి ఏడాది దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు గారు జన్మదిన వేడుకలను పురస్కరించుకొని ఎంతో ఘనంగా నిర్వహిస్తారు. మూడురోజులు పాటు జరిగే ఈ కార్యక్రమాన్ని ఈ ఏడాది కడప జిల్లాలో నిర్వహిస్తున్నారు. ఇప్పటికే కడప జిల్లా మొత్తం పసుపు మయంగా మారిపోయింది ఎంతోమంది అభిమానులు కార్యకర్తలు తెలుగుదేశం పార్టీ నేతలు ఈ కార్యక్రమానికి హాజరయ్యి విజయవంతం చేస్తున్నారు.

ఇక ఈ కార్యక్రమంలో భాగంగా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మాట్లాడుతూ ఆసక్తికరమైన విషయాలను తెలియచేశారు. ఇప్పటివరకు ఎన్నో జిల్లాలలో ఈ మహానాడు వేడుకలను ఘనంగా నిర్వహించారు కానీ కడప జిల్లాలో మహానాడు వేడుకను నిర్వహించడం ఇది మొదటిసారి. ఇలా ఈ ఏడాది కడపలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి గల కారణాలను చంద్రబాబు నాయుడు తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో చంద్రబాబునాయుడు మాట్లాడుతూ… ప్రాణ సమాణమైన టీడీపీ కుటుంబ సభ్యులందరికీ స్వాగతం అంటూ తన ప్రసంగాన్ని మొదలుపెట్టారు.కడప గడ్డపై తొలిసారి మహానాడు నిర్వహిస్తున్నామని, దేవుని కడపలో జరిగే మహానాడు చరిత్ర సృష్టించబోతోందన్నారు. కడపలో తెలుగుదేశం పార్టీకి ప్రజలు ఇచ్చిన తీర్పుకు కృతజ్ఞత తెలియజేయడం కోసమే కడపలో మహానాడు కార్యక్రమాన్ని నిర్వహించామని తెలిపారు.

రాయలసీమలో మహానాడు కార్యక్రమాన్ని నిర్వహించడం అంటే కేవలం తిరుపతిలో మాత్రమే నిర్వహించే వాళ్ళం, కానీ మొదటిసారి ఇలా దేవుని గడప అయినా కడప జిల్లాలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం సంతోషంగా ఉందని తెలిపారు. అయితే గత ఎన్నికలలో కడప జిల్లాలో 10 నియోజకవర్గాలు ఉండగా ఏడు నియోజకవర్గాలలో కూటమి పార్టీలు విజయం సాధించాయని వచ్చే ఎన్నికలలో 10కి పది స్థానాలను కైవసం చేసుకోవాలని తెలిపారు. ఇలా మా పార్టీకి ప్రజలు మద్దతు తెలియజేసినందుకు కృతజ్ఞతలు తెలుపడం కోసమే నేడు ఈ వేడుక ఇక్కడ జరుగుతుందంటూ చంద్రబాబునయుడు చేసిన ఈ వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి.