పవన్ పెళ్లిళ్ల మ్యాటర్ ఎప్పుడూ హాట్ టాపిక్ గా నిలుస్తుంది. సినిమాల్లో ఉన్నప్పటికంటే రాజకీయాల్లోకి వచ్చాక ఆ టాపిక్ కి ఇంకొంచెం క్రేజ్ పెరిగిందని చెప్పొచ్చు. పవన్ ని విమర్శించటానికి అదొక ఆయుధంగా మారిపోయింది అధికార, ప్రతిపక్ష పార్టీల నేతలకి. వైసీపీ అధినేత జగన్ పవన్ కళ్యాణ్ కార్లు మార్చినట్టు పిల్లల్ని మారుస్తాడని, పవన్ నిత్య పెళ్లి కొడుకు అంటూ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. పవన్ కూడా జగన్ ని ఉద్దేశించి రౌడీలు, గూండాల పార్టీ మనది కాదు అంటూ కౌంటర్ ఇచ్చారు. ఇలా వీరు ఇరువురు రాజకీయంగానే కాకుండా ఒకరిపై ఒకరు వ్యక్తిగత విమర్శలు కూడా చేసుకున్నారు. ఇటు జగన్ అభిమానులు, అటు పవన్ అభిమానుల మధ్య సోషల్ మీడియా వేదికగా పెద్ద వార్ నడుస్తోంది.
నిజానికి పవన్ మూడు పెళ్లిళ్లు చేసుకున్నప్పటికీ చట్టపరంగానే చేసుకున్నారు. పూనమ్ కౌర్ ని నాలుగో పెళ్లి చేసుకుంటానని చెప్పి ఆమెను పవన్ మోసం చేశాడంటూ రూమర్స్ వినిపించాయి. అయితే ఇది రాజకీయ స్వార్ధంతో చేస్తున్న చెడు ప్రచారం అంటూ కొట్టి పడేస్తున్నారు జనసేన కార్యకర్తలు, పవన్ సన్నిహితులు. ఎవరెన్ని చెప్పినా పూనమ్ కౌర్ ని పవన్ కి నాలుగో భార్యగా లెక్కించి చెబుతున్నారు పవన్ వ్యతిరేకులు. ఇప్పుడు పవన్ కి ఐదో భార్యగా ఉండటానికి నేను రెడీ అంటోంది ప్రముఖ హీరోయిన్ మాధవి లత. ఈమధ్య కాలంలో తాను ఇచ్చిన ప్రతి ఇంటర్వ్యూలో పవన్ భజన చేస్తోంది. దీంతో పవన్ సపోర్ట్ కోసం ఆమె పవన్ ని పొగుడుతోంది అంటూ ట్రోల్స్ మొదలయ్యాయి. వీటిపై ఒక ఇంటర్వ్యూలో మాధవి లత స్పందించింది.
నేను పవన్ కళ్యాణ్ ఇష్టమని ఇప్పుడు కాదు, నా ఫస్ట్ ఇంటర్వ్యూ నుండి చెబుతున్నాను. అవి ఎవరూ పట్టించుకోలేదు. ఇప్పుడు ఇంటర్వ్యూలు చూసి ఏదో ప్రయోజనం పొందడానికి చెబుతున్నా అనుకుంటున్నారు కానీ నాకు చిన్న వయసు నుండే పవన్ కళ్యాణ్ ఇష్టం. ఒక ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడిన విధానం చూసి అభిమానించడం మొదలు పెట్టాను. స్కూల్ టైంలోనే ఆయనకు లవ్ లెటర్ రాసి పుస్తకాల్లో దాచాను అని పవన్ పై తనకి ఉన్న అభిమానాన్ని తెలిపింది మాధవి. రీసెంట్ ఇంటర్వ్యూల్లో జనసేనకు నేను మద్దతు ఇస్తాను అనేసరికి నేను ఆయన భజన చేస్తున్నా అంటున్నారు కొంతమంది. నీ నంబర్ ఐదా అని అడుగుతున్నారు నన్ను. నా నంబర్ ఐదే..అయితే ఏంటి ప్రాబ్లెమ్? ఎవరో తెలియని వ్యక్తిని పెళ్లి చేసుకుని కష్టాలు పడటంకంటే పవన్ కళ్యాణ్ లాంటి మంచి మనిషిని నేను పెళ్లి చేసుకుంటే తప్పేంటి? అని ప్రశ్నించింది మధులత. నంబర్ ఐదు అయితే ప్రాబ్లెమ్ లేదు కానీ మాధవి లత కూడా నంబర్ నాలుగు ఉందని ఫిక్స్ అయ్యిందా? అందుకే ఐదుకి సై అందా?? నాలుగు ఉండి, పవన్ ఇష్టంతో ఈమె ఐదో స్థానం తీసుకుంటే ప్రాబ్లెమ్ లేదు కానీ లేకపోతేనే ప్రాబ్లెమ్ సుమీ. అనవసరంగా నోరు జారి పవన్ నాలుగో పెళ్లిపై వస్తున్న రూమర్లకు ఇంకొంచెం బలం చేకూర్చినట్టు అవుతుంది కదా మరి.