చంద్రబాబునాయుడు పరువును కృష్ణమ్మ సాంతం తీసేసింది. చంద్రబాబు మాట వినకుండా నేరుగా ఆయన నివాసముంటున్న అక్రమ నివాసంలోకే వచ్చేస్తోంది. అప్పటికీ చంద్రబాబు కృష్ణమ్మకు చెబుతునే ఉన్నారు డైవర్షన్ తీసుకుని ఎక్కడినుండో వెళ్ళిపోమని. కానీ కృష్ణమ్మే మాట వినకుండా బిరబిర గెస్ట్ హౌస్ లోకి వచ్చేస్తోంది.
అధికారంలోకి వచ్చిన కొత్తల్లోనే హుద్ హుద్ తుపానును నియంత్రించగలిగారు చంద్రబాబు. తర్వాత వచ్చిన తిత్లి తుపానును కూడా కంట్రోల్ చేసి ఒడిస్సా వైపు పంపిచేయగలిగారు. అంతే కానీ కృష్ణానదిని మాత్రం నియంత్రించలేకపోయారు. కృష్ణమ్మ దెబ్బకు చివరకు ఇంటిని ఖాళీ చేసి కుటుంబంతో సహా హైదరాబాద్ కు వెళ్ళిపోయారు. చేసేది లేక గెస్ట్ హౌస్ చుట్టూ ఇసుక బస్తాలు వేసి నీటిని ఆపే ప్రయత్నాలు జరుగుతున్నాయి.
మొన్నటికి మొన్న అసెంబ్లీలోనే తాను గెస్ట్ హౌస్ ను ఖాళీ చేసేది లేదంటే లేదని తెగేసి చెప్పారు. అప్పటికీ కృష్ణానది పొంగితే ఇబ్బందవుతుందని జగన్మోహన్ రెడ్డి అండ్ కో ఎంత చెప్పినా చంద్రబాబు అండ్ కో కనీసమాత్రంగా కూడా వినలేదు. ఇప్పుడేమైంది, జగన్ చెప్పిందే కరెక్టయి చివరకు చంద్రబాబు పరువు పోయింది.
కేవలం 4.5 లక్షల క్యూసెక్కుల నీటి విడుదలకే ఇంత గోలైతే ఇక మొత్తం 8 లక్షల క్యూసెక్కుల నీటిని వదిలేస్తే కరకట్ట భద్రత గోవిందా ? ఇప్పటికే అదే కరకట్టపైన ఉన్న బిజెపి మాజీ ఎంపి గోకరాజు గంగరాజు గెస్ట్ హౌస్ లోకి నీళ్ళు వచ్చేశాయి. ప్రకృతి వైద్యం చేస్తున్న మంతెన సత్యనారాయణరాజు భవనంలోకి కూడా నీళ్ళొచ్చేస్తున్నాయట. అంటే ఇప్పటికన్నా మరికొంచెం వరద గనుక పెరిగితే మొత్తం కరకట్టే కొట్టుకుపోయినా ఆశ్చర్యం లేదు.