అవకతవకలతో నాసిరకం పనులతో రోడ్లను వేసి ప్రజలను ఇబ్బందుకు గురిచేస్తున్న నెల్లూరు కార్పొరేషన్ ఇంజనీరింగ్ అధికారల, కాంట్రాక్టర్ల అవినీతికి వ్యతిరేకంగా ఆందోళన చేసిన రూరల్ ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి నేడు తన దష్టిని మాల్స్ లో సాగుతున్న దోపిడీ మీదకు మళ్లించాారు.
నెల్లూరు పట్టణంలోని మాల్స్ లో అధిక ధరలకు సరుకులను విక్రయించడంతో , విపరీతంగా పార్కింగ్ ఫీజు వసూలు చేస్తూ ప్రజలను దోచుకుంటున్న విధానాలకు వ్యతిరేకంగా ఈ రోజు ఎం.జి. మాల్ ముందు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ధర్నాచేశారు.
మాల్ థియేటర్స్ లో తినుబండారాల , పార్కింగ్ ఫీజుల అధిక ధరలతో జనం అల్లాడుతున్నారని ఆయన అన్నారు.
ఇంత జరుగుతున్న అధికారులకు చీమ కుట్టినట్లు కూడ లేదని ఆయన విమర్శించారు.
కోర్ట్ ఉత్తర్వులు ధిక్కరించి, ఇష్టారాజ్యాంగా ప్రవర్తిస్తూ, ప్రజలను ఇబ్బందులు పెట్టె దానికి మాల్స్ కి ఏమైనా సొంత రాజ్యాంగం ఉందా? అపి ఆయన ప్రశ్నించారు.
ప్రజలను ఇబ్బందిపెట్టే మాల్ థియేటర్లలో అధిక ధరలపై చర్యలు తీసుకోకుంటే కలెక్టర్ ను, మేయర్ ను కోర్టుకు ఇడుస్తానని ఆయన హెచ్చరించారు.
యాజమాన్యాలతో మాట్లాడి రెండు రోజుల్లో సమస్య పరిస్కరిస్తామని అధికారులు ఇచ్చిన హామీతో కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ధర్నా విరమించారు.