స్క్రాపు – స్కాపు – కాపు.. మధ్యలో కొడాలి నాని!

మాజీమంత్రి కొడాలి నాని వ్యాఖ్యలు ఇప్పుడు ఏపీలో దుమారం రేపుతున్నాయి. కాపులను అసభ్యకరంగా దూషించి అవమానించారంటూ కొంతమంది కాపు నాయకులు రోడ్డెక్కారు. కాపులను అసభ్యకరంగా దూషించి అవమానించిన గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నానీని వైసీపీ నుంచి బహిష్కరించాలని డిమాండ్ చేస్తున్నారు. రంగా విగ్రహాలకు దండలు వేసి, రంగా కుమారుడితో మాట్లాడితే సరిపోదని, సాటివారిని గౌరవించడం తెలుకోవాలని ఐక్య కాపునాడు, కాపు సంక్షేమ యువసేన హితవుపలుకుతున్నాయి.

అయితే… అసలు ఏమి జరిగింది, నిజంగా కొడాలి నాని అన్నమాటలేమిటి, జనాల్లోకి వెళ్లిన సౌండ్ ఏమిటి అన్నది ఇప్పుడు చూద్దాం!

మహానాడులో జరుగుతున్న ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలపై స్పందించిన కొడాలి నాని… మహానాడులో ఎన్టీఆర్ కి ఘనమైన నివాళి అంటూ ప్రత్యేకంగా ఏమీ జరగలేదని.. కేవలం చంద్రబాబు తనను పొగిడించుకోవడానికి ఈ మహానాడు పెట్టాడని దుబ్బయట్టారు. అనంతరం “స్క్రాప్” నా పుత్రులంతా కలిసి రాజమండ్రిలో మహానాడు పెట్టుకున్నారని ఫైరయ్యారు!

అయితే… ఒకటికి రెండుసార్లు స్క్రాప్ స్క్రాప్ అనే మాట ప్లేస్ లో… సా, ఆర్, సైలంటయ్యి “స్కాపు” అనే పదం బయటకు వచ్చింది! అది కాస్తా “కాపు” అయ్యిందని రచ్చ మొదలైపోయింది! ఈ వీడియోని క్లియర్ గా చూస్తూ, క్లీన్ గా వింటే అది స్పష్టమవుతుందని తెలుస్తుంది. అయితే దున్నపోతు ఈనిందంటే దూడని కట్టేయండని రకం జనాలు, మీడియా ఉండటంతో… ఇదిగో ఇంత రచ్చ అవుతుంది!

Kodali Nani Comments on TDP Mahanadu in Rajahmundry | Chandrababu | Nara Lokesh | NTR |@SakshiTV