జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వ పాలన అంటే బడుగు, బలహీన, రైతు వర్గాల ప్రభుత్వం. ఏడాది పాలనలోనే ఆ విషయం స్పష్టమైంది. ఇచ్చిన మాటను..చేసిన వాగ్ధానాన్ని నిలబెట్టుకున్న నాయకుడిగా ప్రజల్లో నీరాజనాలు అందుకుంటున్నారు. కుల..మత..ప్రాంత బేధాలు లేకుండా ప్రజలంతా జగన్ మోహన్ రెడ్డి పాలన సుభిక్షంగా సాగుతోంది. త్వరలో 30 లక్షల మంది నిరుపేదలకు ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమంతో జగన్ తిరుగులేని నాయకుడిగా ఉదయించనున్నాడు. పాలన సహా…సంక్షేమ పథకాలు అమలు విషయంలో రాజన్న దారిలోనే..జగనన్న నడుస్తున్నాడని ప్రజలతోనే జేజేలు కొట్టించుకునే రోజులు సమీపంలోనే ఉన్నాయి. అయితే మూడు రాజధానుల నిర్ణయంతో అమరావతిలో వ్యతిరేకత వ్యక్తమైనప్పటికీ కేవలం ఆ వ్యతిరేకత ఒక సామాజిక వర్గం నుంచే ఎక్కువగా ఫోకస్ అయింది.
సరిగ్గా ఆ అయుదాన్ని వాడుకుని ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు వైసీపీని రాష్ర్టంలో అణగదొక్కాలని స్కెచ్ వేసారు. కానీ అది రివర్స్ అయింది. ఆ ప్రాంతాల్లో వచ్చిన వ్యతిరేకత కమ్మ సామాజిక వర్గం నుంచి వచ్చింది తప్ప..అణగారిన వర్గం నుంచి రాలేదన్నది వాస్తవం. జగన్ ఇప్పుడు సరిగ్గా ఇదే అస్ర్తాన్ని చంద్రబాబు మీదకు వదలబోతున్నాడా? ఈ పాయింట్ ఆఫ్ వ్యూలోనే మంత్రి కొడాలి నాని శాసన రాజధానికి కూడా అమరావతిలో ఉండకూదన్నారా? అంటే అవుననే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. గుంటూరు, కృష్ణా జిల్లాల్లో కమ్మ సామాజిక వర్గం ప్రాబల్యం గల జిల్లాలు.
అదే స్థాయిలో అణగదొక్కబడిన వర్గాలు ఆ జిల్లాల్లో కొన్ని దశాబ్ధాలుగా వివక్షకు గురవుతున్నాయి. ప్రభుత్వం నుంచి ఎలాంటి ఫలం అందని బడుగు..బలహీన వర్గాలు అక్కడా అధికంగానే ఉన్నాయి. ఇప్పుడు ఇళ్ల పట్టాల పంపిణీ విషయంలో తెలుగు దేశం నేతలు వైసీపీ ప్రభుత్వానికి ఎలా అడ్డుతగులుతున్నారో తెలిసిందే. ఇప్పుడు ఈ పాయింట్ పట్టుకునే వైసీపీ నేతలు టీడీపీ నేతలపై పేదలతోనే ఎటాక్ చేయించేలా రాజకీయ ఎత్తుగడ వేస్తున్నట్లు తెలుస్తోంది. ఇదంతా జగన్ ఆడిన నాటకంలో భాగంగానే కొడాలి ఆ కామెంట్ చేసినట్లు పలువురి అభిప్రాయం. పేదలకు కావాల్సింది ప్రభుత్వం నుంచి వచ్చే సక్షేమ ఫలాలు..ఇళ్ల పట్టాలు సక్రమంగా అందాలి. కానీ టీడీపీ వాటికే అడ్డు తగులుతుంది. కాబట్టి గుంటూరు, కృష్ణా జిల్లాల్లో బడగు, బలహీన వర్గాల నుంచి టీడీపీపై వ్యతిరేకత తీసుకొస్తే! వైసీపీ ఆ రెండు జిల్లాల్లో బలపడినట్లే కదా! అన్నది కొందరి అభిప్రాయం.