ఏపీ నుంచి లక్ష మంది.. కేసీఆర్ ప్లాన్ వర్కౌట్ అవుతుందా?

1295413-kcr

ఎంతమంది ఎన్ని విమర్శలు చేసినా బీఆర్ఎస్ పార్టీ విషయంలో కేసీఆర్ వెనక్కు తగ్గేలా లేరు. ఎంతో కష్టపడి తెలంగాణను సాధించుకున్న కేసీఆర్ ఏపీలో బీఆర్ఎస్ పార్టీ ఇతర పార్టీలకు గట్టి పోటీ ఇవ్వాలని భావిస్తున్నట్టు సమాచారం. ఇందుకు సంబంధించి ఒక్కో వ్యూహాన్ని అమలు చేస్తున్న కేసీఆర్ ఆ వ్యూహాల అమలు ద్వారా పాజిటివ్ ఫలితాలనే పొందుతున్నారని పొలిటికల్ వర్గాల్లో జోరుగా వినిపిస్తోంది.

బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ సభకు ఏపీ నుంచి ఏకంగా లక్ష మంది వచ్చేలా కేసీఆర్ ప్లాన్ సిద్ధం చేశారని తెలుస్తోంది. ఇందుకు సంబంధించి కేసీఆర్ ప్లాన్ వర్కౌట్ అవుతుందో లేదో చూడాలి. ప్రస్తుతం ఏపీ బీఆర్ఎస్ చీఫ్ గా తోట చంద్రశేఖర్ ఉన్నారు. ఏపీ నుంచి జనాన్ని సమీకరించే బాధ్యత ప్రస్తుతం ఆయనపై ఉందని తెలుస్తోంది. ఖమ్మం జిల్లాలో ఈ సభ జరగనుండగా ఈ సభ కోసం భారీ స్థాయిలో ఖర్చు చేయనున్నారని సమాచారం.

మొత్తం ఐదు లక్షల మంది ఈ సభకు హాజరు కానున్నారని బోగట్టా. ఈ సభ ద్వారా కేసీఆర్ తన స్థాయి ఏంటో ప్రజలకు, ఇతర రాష్ట్రాల నేతలకు తెలిసేలా చేయాలని భావిస్తున్నట్టు సమాచారం అందుతోంది. ఏపీలో ప్రముఖ యాడ్ ఏజెన్సీల తరపున పార్టీ ఫ్లెక్సీలు కూడా సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. గోదావరి జిల్లాలతో పాటు కృష్ణా, గుంటూరు జిల్లాల నుంచి జన సమీకరణ జరగనుందని బోగట్టా.

బీఆర్ఎస్ పార్టీ ఏపీలో సంచలనాలు సృష్టిస్తుందో లేదో చూడాల్సి ఉంది. కేసీఆర్ మాత్రం పార్టీని బలోపేతం చేయడానికి ఉన్న ఏ ఒక్క అవకాశాన్ని వదులుకోకూడదని భావిస్తున్నారని బోగట్టా. కేసీఅర్ రాజకీయాల్లో మరిన్ని సంచలనాలు సృష్టించాలని ఆయన వీరాభిమానులు భావిస్తున్నారు. పీఎం కావాలని కేసీఆర్ కోరుకుంటుండగా ఆయన ప్లాన్ వర్కౌట్ అవుతుందో లేదో చూడాలి.