జ‌గ‌న్‌కి ఎంపీ కవిత బ‌ర్త్‌డే విషెస్: సోషల్ మీడియాలో వైరల్

ఏపీ ప్రతిపక్ష నేత, వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి పుట్టిన రోజు సందర్భంగా తెలంగాణ సీఎం కేసీఆర్ కూతురు ఎంపీ కవిత శుభాకాంక్షలు తెలిపారు. ఆమె తన ట్విట్టర్లో జగన్ కి విషెస్ తెలిపారు. ఆమె చేసిన ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ ఐంది. అభిమానులు లైక్స్, రీట్వీట్స్ చేస్తున్నారు. కవిత జగన్ కి విష్ చేయడంలో విశేషమేముంది అనుకుంటున్నారా? అయితే కింద ఉన్న మ్యాటర్ చదవాల్సిందే…

ట్విట్టర్లో ఒక నెటిజెన్ కవితను వైఎస్ జగన్ మోహన్ రెడ్డిగారికి బర్త్ డే విషెస్ చెప్పండి మేడం అంటూ ట్వీట్ చేసాడు. ఆ ట్వీట్ కి స్పందించిన కవిత “జగన్ అన్నా..మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే అంటూ విష్ చేసారు. ఆమె విషెస్ కి జగన్ రిప్లై ఇచ్చారు. “థాంక్యూ ఫర్ యువర్ వార్మ్ విషెస్ కవితమ్మ” అంటూ ట్వీట్ చేసారు. ఇదంతా నెటిజన్లను ఆకట్టుకుంది. దీంతో జగన్ అభిమానులు, కవిత అభిమానులు ఆ ట్వీట్స్ వైరల్ చేస్తున్నారు. కింద ఆ ట్వీట్స్ చూడవచ్చు.