ఇది ఎన్నికల సీజన్. కేసీఆర్ తన ప్రభుత్వాన్ని రద్దు చేయడంతో తప్పనిసరైన ఈ ముందస్తు ఎన్నికలు తెలంగాణలో రాజకీయ వేడిని రాజేస్తున్నాయి. జాతీయ పార్టీలు బీజేపీ, కాంగ్రెస్ లతో పాటు తెలుగుదేశం(టీడీపీ), తెలంగాణ రాష్ట్ర సమితి, ఏఐఎంఐఎంతో పాటు కొత్త పార్టీ తెలంగాణ జన సమితి ఓటరు తీర్పును కోరుతూ ఈ సమరంలో పోరాటానికి రెడీ అవుతున్నాయి. అందులో భాగంగానే టీఆర్ ఎస్ ని ఎదుర్కోవటానికి.. కాంగ్రెస్ తో కలసి టీడీపీ మహాకూటమిగా ఏర్పడింది. దీంతో, రాష్ట్రంలో ఎలక్షన్ హీట్ పెరిగింది.
ఈ నేపధ్యంలో అభ్యర్దుల ఎన్నికే ఏ పార్టీకైనా కీలకంగా మారే అంశం. హైదరాబాద్ జూబ్లీహిల్స్ నియోజకవర్గం నుంచి తన అన్న హరికృష్ణ కుమారుడు సినీ నటుడు కల్యాణ్ రామ్ ను బరిలోకి దింపాలని బాలకృష్ణ ప్లాన్ చేస్తున్నాట్టు సమాచారం.
ఈ ప్లేస్ నుంచి అయితే కల్యాణ్ రామ్ పోటీ చేస్తే, గెలుపు గ్యారెంటీ అని బాలయ్య భావిస్తున్నారు. తన అన్న హరికృష్ణపై ప్రజల్లో ఉన్న సానుభూతి కూడా కలిసొస్తుందనేది ఆయన నమ్మకంగా చెప్తున్నారు.
అయితే ఎన్నికల్లో పోటీ చేసేందుకు కల్యాణ్ రామ్ సముఖంగా లేడనేది ఆయన సన్నిహితుల నుంచి వినపిస్తున్న వార్త. ఈ నేపథ్యంలో టీడీపీ అధినేత చంద్రబాబు ఏమి నిర్ణయం తీసుకుంటారనేది ఖచ్చితంగా కీలకం అవుతుంది.
తన అన్న హరికృష్ణ మరణం తర్వాత… కల్యాణ్ రామ్, తారక్ లకు తండ్రిలేని లోటును బాలయ్యే తీర్చుతున్నారు. ఎన్టీఆర్ చిత్రం ‘అరవిందసమేత’ సక్సెస్ మీట్ కు కూడా ఆయన హాజరయ్యన సంగతి తెలిసిందే.