వారాహి యాత్రలో పదేపదే కాకినాడ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డిని పవన్ కల్యాణ్ టార్గెట్ చేస్తున్న సంగతి తెలిసిందే. అది సహజం అనిసరిపెట్టుకున్నా… ఈ విమర్శలు శృతిమించుతున్నాయని, రాజకీయాలపై కాకుండా వ్యక్తిగత విషయాలపై మాట్లాడుతున్నారని ఆయన అభిమానులు ఫైరవుతున్నారు. పిచ్చి పిచ్చి విమర్శలు మానుకోమని సలహా ఇస్తున్నారు. ఈ నేపథ్యంలో ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డికి మద్దతుగా కాకినాడ వైసీపీ కాపు, బీసీ, ఎస్సీ, ఎస్టీ నేతలు మీడియా ముందుకు వచ్చారు.
దీంతో… వారాహి యాత్రాలో భాగంగా కాకినాడ వద్ద సర్పవరం జంక్షన్ లో జరిగబోయే సభ ఉత్కంఠ భరితంగా మారింది. కానినాడలో జరిగిన మీటింగ్స్ లో మైకందుకున్న పవన్… ద్వారంపూడి పై తీవ్ర విమర్శలు చేశారు. కాపులకు అతడు బద్ద శత్రువు అన్నస్థాయిలో జనసైనికులకు కౌన్సిలింగ్ ఇవ్వడం మొదలుపెట్టారు. దీంతో… కాకినాడలోని వైసీపీ కాపులు, బీసీలు, ఎస్సీ, ఎస్టీలు ద్వారంపూడి చంరశేఖర్ రెడ్డితో కలిపి మీడియా ముందుకు వచ్చారు.
ఈ సందర్భంగా వారు చేసిన వ్యాఖ్యలు స్థానికంగా సంచలనంగా మారాయి. ఈ సందర్భంగా మీడియా సమావేశంలో మాట్లాడిన వైసీపీ కాపు నేతలు.. పవన్ కల్యాణ్ కు ద్వారంపూడి ఫోబియా పట్టుకుందని ఎద్దేవా చేశారు. మాటకు ముందు చెప్పు తీస్తా, తోలు తీస్తా అంటే ఇవతలి వ్యక్తులు ఊరుకుంటారా అని పవన్ ను ప్రశ్నించారు. కాపు నాయకులమైన తాము ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ఎలా ఉన్నారని పలకరించిన వ్యక్తి ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి మాత్రమేనని ఈ సందర్భంగా వారు గుర్తుచేసుకున్నారు.
ఇక్కడున్న కాపులను ఎలా కలుపుకుని వెళ్లాలో చంద్రశేఖర్ రెడ్డికి తెలిసినట్టుగా ఎవరికీ తెలియదని.. ఆయన ఎప్పుడూ కులంతో రాజకీయం చేసే వ్యక్తి కాదని తెలిపారు. ఇదే సమయంలో ప్రశాంతంగా ఉండే కాకినాడలో, అన్నదమ్ములుగా ఉండే అన్ని సామాజికవర్గాల మధ్య కుల గొడవలు సృష్టించొద్దని సూచించారు. కాకినాడలో రంగా మీటింగ్ పెట్టినప్పటి నుంచీ తాము ద్వారంపూడి కుటుంబంతోనే ఉన్నామని ఈ సందర్భంగా కాపునాయకులు పవన్ కి స్పష్టం చేశారు.
ఆ సంగతి అలాఉంటే… వారాహి యాత్రాలో భాగంగా పవన్ కళ్యాణ్ పర్యటన ఉత్కంఠంగా మారింది. పవన్ కాకినాడలో నిర్వహించిన నాయకుల సమావేశంలో మాట్లాడుతూ తనకు ప్రాణహాని ఉందని సంచలన వ్యాఖ్యలు చేయడంతో… ఆదివారం కాకినాడ వద్ద సర్పవరం జంక్షన్ లో జరిగబోయే సభ ఉత్కంఠ భరితంగా మారింది.