Home Andhra Pradesh వైసీపీలో ఎంపీ సీటుపై సిఐ మాధవ్ రియాక్షన్ ఇదే (వీడియో)

వైసీపీలో ఎంపీ సీటుపై సిఐ మాధవ్ రియాక్షన్ ఇదే (వీడియో)

గత కొన్ని రోజులుగా అనంతపురం జిల్లా కదిరి సిఐ గోరంట్ల మాధవ్ వార్తల్లో నిలుస్తున్నారు. ఆయన పదవిని విడిచి రాజకీయ రంగప్రవేశం చేయనున్నారు అనే న్యూస్ హాట్ టాపిక్ అయింది. అందునా ఆయన వైసీపీలో చేరనున్నారు అనేది టాక్ ఆఫ్ ది స్టేట్ గా మారింది. ఇది నిజామా కాదా అని నిట్టూర్చేలోపే ఆయన శుక్రవారం రాత్రి డీఎస్పీ శ్రీలక్ష్మిని కలవడం, రాజీనామా లేఖ అందజేయడం జరిగిపోయింది. ఇక ఎస్పీని కలిసి రాజీనామా నిర్ధారణ చేసుకుని అనంతరం అధికారిక ప్రకటన చేయడం ఒక్కటే మిగిలి ఉంది.

కానీ ఈలోపే ఆయన రాజీనామా వ్యవహారం మీడియాలో దుమారం రేపింది. గోరంట్ల మాధవ్ రాజీనామా చేశారని రాష్ట్రమంతా చర్చ సాగింది. దీంతో ఆయన మీడియా ఎదుట ఈ విషయం గురించి స్పందించారు. డీఎస్పీని కలిసి రాజీనామా విషయాలపై చర్చించడం జరిగింది అని తెలిపారు. తన కుటుంబంతో మరొక్కసారి సంప్రదింపులు జరిపి అనంతరం ఎస్పీ జివిజి అశోక్ కుమార్ ని కలవనున్నట్టు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన రాజకీయాలలోకి ఎందుకు రావాలి అనుకుంటున్నారో తెలియజేసారు. ఏ పార్టీలో చేరనున్నారు? జేసీ వ్యాఖ్యలను సీరియస్ గా తీసుకుని రాజకీయాల్లోకి వస్తున్నారా? అనే ప్రశ్నలకు ఆయన సమాధానం సూటిగా సమాధానం ఇవ్వలేదు.

తన కుటుంబ నేపథ్యం వివరించారు తప్ప ఎలాంటి రాజకీయ పరమైన కామెంట్స్ చేయలేదు. హిందూపూర్ నుండి వైసీపీ తరపున ఎంపీ అభ్యర్థిగా బరిలోకి దిగనున్నారు అనే వార్తలపైన రియాక్ట్ అయిన ఆయన ఇంకా ఆ విషయాలపై రాజీనామా ఆమోదం పొందిన అనంతరం మాట్లాడతాను అని చెప్పారు. బహుశా ఆయన ఇంకా రాజకీయ నేతగా పాలిటిక్స్ లోకి అడుగు పెట్టలేదు కాబట్టి పొలిటికల్ కామెంట్స్ చేయలేదని తెలుస్తోంది. పైగా ఆయన రాజీనామా అయితే చేశారు కానీ… ఇంకా ప్రభుత్వ సర్వెంట్ గానే ఉన్నారు. ఆయన రాజీనామా ఆమోదం పొందిన తర్వాతే ఆయన రాజకీయాలు మాట్లాడాలన్న ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.

అంతేకాకుండా ఆయనను వైసిపి నేతలు ఆరకమైన ట్యూనింగ్ చేశారని అంటున్నారు. అందుకే గోరంట్ల మాధవ్ సాదాసీదాగానే మాట్లాడారు. పోలీసుగా ఉన్నప్పుడు మీసం తిప్పి… జెసి మీద తొడగొట్టి సవాల్ చేసిన కదిరి సిఐ ఇప్పుడు ఆ భాష కాకుండా నార్మల్ గా మాట్లాడడం చూస్తే ఇదంతా వైసీపీ ట్రైనింగ్ అనే చెబుతున్నారు. ఇక రాజీనామా ఆమోదం పొందిన తర్వాత కచ్చితంగా మాధవ్ తన సత్తా ఏంటో ప్రత్యర్థులకు రుచి చూపుతాడని వైసిపి వర్గాల్లో నడుస్తున్న టాక్. ఇంతకూ రాజీనామా ప్రకంపనలపై మాధవ్ ఏం మాట్లాడారో తెలియాలంటే కింద ఉన్న వీడియో చూడండి.

- Advertisement -

Related Posts

భక్తితో ఇచ్చిన కానుకను తిరస్కరించారని ప్రభుత్వం మీద అశోక్ గజపతి రాజు ఫైర్

ఆంధ్రప్రదేశ్: విజయనగరం జిల్లాలో గజపతి రాజులు గురించి, చెప్పాల్సిన పని లేదు. ఆ కుటుంబం త్యాగాల ముందు, ఇందిరా గాంధీ లాంటి నేత కూడా గౌరవంగా తల వంచి నమస్కారం పెట్టారంటే, ఆ...

మారవయ్యా జగనూ. మళ్ళీ కోర్టు టిడితే తిట్టింది అంటావు

ఆంధ్రప్రదేశ్ లో ఉన్న రాజకీయాలు నాయకలు ప్రజల యొక్క సమస్యల గురించి తప్ప అన్నింటి గురించి చర్చిస్తున్నారు, పోరాడుతున్నారు. ఏపీలో వైసీపీ, టీడీపీ కార్యకర్తల మధ్య నిత్యం గొడవలు జరుగుతూనే ఉన్నాయి. గతంలో...

వీర్రాజు ఆవేశంతో అభాసు పాలైన బీజేపీ ? ఇది చెయ్యకూడని తప్పు ?

రెండు తెలుగు రాష్ట్రాల్లో తమ జెండాను పాతడానికి బీజేపీ నాయకులు చాలా ప్రయత్నాలు చేస్తున్నారు. అలాగే ఇప్పుడు తెలంగాణలో బీజేపీ తమకంటూ ఒక గుర్తింపును సంపాదించుకుంది. తెలంగాణలో సీఎం కేసీఆర్ కు చుక్కలు...

ఒక పక్క వ్యాక్సీన్ వేస్తుంటే – సడన్ గా భారీ ట్విస్ట్ ?

కరోనా వ్యాధికి దేశంలో వ్యాక్సినేషన్ ప్రారంభమయింది. మొదట ఆరోగ్య సిబ్బందికి ఇస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లోనూ వ్యాక్సిన్ ఇచ్చే ప్రక్రియ ప్రారంభమయింది. ప్రధానమంత్రి నరేంద్రమోడీ… ముందుగా టీకాలు తీసుకునేవారితో మాట్లాడి.. నాలుగు మంచి మాటలు...

Latest News