Perni Nani: ప్రస్తుతం అదానీ విషయంలో వైయస్ జగన్మోహన్ రెడ్డి పేరును వాడుతూ కూటమి నేతలు చేస్తున్న ఆరోపణలపై వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ మాజీ మంత్రి పేర్ని నాని మీడియా సమావేశంలో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వ నేతలపై అలాగే చంద్రబాబు నాయుడు పై విమర్శల వర్షం కురిపించారు. ఈ సందర్భంగా మీడియా సమావేశంలో పేర్ని నాని మాట్లాడుతూ.. చంద్రబాబు నాయుడు జగన్ పతనాన్ని కోరుతూ చీకట్లోనే కాంగ్రెస్ తో చేతులు కలిపిందని విమర్శించారు.
గత 15 సంవత్సరాల నుంచి తన పచ్చ మీడియా అలాగే పచ్చ పేపర్ ద్వారా జగన్ పై విషం చిమ్ముతూ తన పతనాన్ని కోరుకుంటుందని తెలిపారు. అయితే జగన్మోహన్ రెడ్డి గురించి ఎన్ని కుట్రలు చేసిన ఆయన వాటన్నింటినీ పటాపంచలు చేస్తూ ముందుకు సాగుతున్నారని పేర్ని నాని తెలిపారు. గతంలో కూడా జగన్మోహన్ రెడ్డి పై అమెరికా కేసులంటూ రామోజీ పేపర్ ద్వారా విషపు రాతలు రాయించావు. ఇప్పుడు మరోసారి అమెరికా కేసులంటూ జగన్మోహన్ రెడ్డి పేరును అంతర్జాతీయ స్థాయిలో మారుమోగేలా చేస్తున్నావు.
ఎప్పుడైతే సింగపూర్ మంత్రి ఈశ్వర్ జైలుకు వెళ్లారో అప్పుడే నీ పేరు అంతర్జాతీయ స్థాయిలో మారుమోగిపోయింది చంద్రబాబు అంటూ నాని విమర్శలు కురిపించారు. జగన్మోహన్ రెడ్డికి అదానీ 1750 కోట్లు లంచం ఇచ్చిందని తప్పుడు రాతలు రాశావు. సెకీతో విద్యుత్ ఒప్పందాలు కుదుర్చుకొని కొనుగోలు చేస్తే అవినీతా? అదానీతో బాబు కలిస్తే ఆహా ఓహో అంటూ తప్పుడు రాతలు రాస్తూ రాష్ట్రానికి పెట్టుబడులు వస్తున్నాయి అంటూ రాసిన ఈనాడు ఎప్పుడైనా మార్గదర్శి పాపాలను నీ పేపర్లో రాసారా అంటూ ప్రశ్నించారు.
కేంద్ర రంగ సంస్థ సెకీతో ఏపీ ప్రభుత్వం విద్యుత్ కొనుగోలు ఒప్పందం చేసుకుంది. రూ.2.49లకే 25 సంవత్సరాలపాటు విద్యుత్ ఇచ్చేందుకు సెకీ అంగీకరించింది. ఇందులో తప్పేముందని తెలిపారు. అదే చంద్రబాబు నాయుడు రూ.4.50ల చొప్పున చంద్రబాబు ప్రభుత్వం ఒప్పందం చేసుకుంటే తప్పా.జగన్ ప్రభుత్వం చేసుకున్న ఒప్పందాలు తప్పు అయితే దాన్ని రద్దు చేయి చూద్దాం అంటూ ఈ సందర్భంగా పేర్ని నాని చంద్రబాబు నాయుడుకు కౌంటర్ ఇస్తూ చేసిన ఈ కామెంట్స్ మారాయి.