కడప టిడిపి అధ్యక్షుడు వాసురెడ్డితో పాడ్ కాస్ట్ ఇంటర్వ్యూ వినండి

కడప జిల్లాలో ఇపుడు తరచు వినిపించే మాట వాసు.

2019 ఎన్నికల్లో టిడిపి ఇక్కడ జండా ఎగరేయాలనుకుంటున్నది. 2014లో కేవలం ఒకే ఒక్క సీటుతో బతికి బయటపడ్డ టిడిపి ప్రతీకారం తీర్చుకోవాలనుకుంటున్నది. ఒకటి కాదు, రెండు కాదు, జిల్లాలోని 10 సీట్లలో మెజారిటీ గా గెల్చుకుని ఇది  టిడిపికి కంచుకోట జిల్లా అని ప్రకటించాలనుకుంటున్నది. చంద్రబాబు  వేసిన ఈ పథకం అమలుచూసే బాధ్యత భుజానేసుకున్న  నాయకుల్లో వాసు ఒకరు.

అన్నట్లు, వాసు ఎవరో తెలుసా?

వాసు పూర్తిపేరు రెడ్డప్పగారి శ్రీనివాస రెడ్డి,  ఆయన్ని ముచ్చటేసే రెండక్షరాలకు ఆయన్ని కుదించి  అంతా వాసు అని పిలుచుకుంటారు.

టిడిపి జిల్లా అధ్యక్షుడయి వాసు లో సెల్ఫ్ కాన్పిడెన్స్ అపారం.

వైఎస్ ఆర్ కుటుంబం జిల్లా అయిన కడపను ఈ సారి టిడిపి కైవసం చేసుకుంటుందంటారు. కడప వైఎస్ ఆర్  ఫ్యామిలీ కంచుకోటగా కొనసాగుతుందంటే ఆయన ఒప్పకోరు. రెడ్లంతా వైసిపి అనే దాన్ని కూడా ఆయన అంగీకరించరు.  కడప జిల్లాలో రెడ్లెక్కువ టిడిపిలోనే ఉన్నారంటారు. అదే విధంగా టిడిపి కమ్మ పార్టీ అంటే కూడా ఒప్పకోరు. టిడిపి నిండా ఉండేది వెనకబడిన బడుగువర్గాలే నాయకులే నని చెబుతారు.

టిడిపి మళ్లీ 2019లో ట అధికారంలోకి వస్తుందని ఆశాభావం వెనకచాలా కారణాలను ఆయన ఉదహరిస్తారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం ఎవరి వల్ల కాలేదని దానిని చంద్రబాబు భుజస్కందాలపై వేసుకొని పూర్తి చేస్తున్నాడని ఆయన కొనియాడారు.

పోలవరం పూర్తైతే రాయలసీమ కష్టాలు తీరినట్లేనన్నారు. కడప జిల్లా టిడిపి అధ్యక్షుడు శ్రీనివాస రెడ్డితో తెలుగు రాజ్యం ప్రతినిధి గణపతి చేసిన పాడ్ కాస్ట్ ఇంటర్వ్యూ కింద ఉంది వినండి.

https://telugurajyam.com/wp-content/uploads/2018/08/VASU-TDP-Kadapa-President-online-audio-converter.com_.mp3?_=1

చంద్రబాబు గారు చేస్తున్న ప్రగతికి ప్రజలు పట్టం కడుతారన్నారు. ప్రతిపక్ష నేత ఏం మాట్లాడుతున్నారో ఆయనకే అర్ధం కానీ పరిస్థితి ఉందని ఎద్దేవా చేశారు. శ్రీశైలం ప్రాజెక్టు నిండిదని శ్రీశైలం వాటర్ తో సీమ సస్యశ్యామలమవుతుందన్నారు. ఏదేమైనా మళ్లీ 2019లో టిడిపి అధికారంలోకి వస్తుందన్నారు.

ప్రజల సమస్యలు తెలుసుకుంటున్న శ్రీనివాసురెడ్డి