KA Paul: అల్లు అర్జున్ కి ఒక న్యాయం.. చంద్రబాబుకు ఒక న్యాయమా: కేఏ పాల్

KA Paul: అల్లు అర్జున్ అరెస్ట్ విషయం ఇటు రాజకీయాల పరంగా కూడా చర్చలకు కారణమైంది అల్లు అర్జున్ అరెస్ట్ కావడంతో ఎంతోమంది రాజకీయ నాయకులు కూడా ఈయన అరెస్టుపై స్పందిస్తూ తీవ్ర స్థాయిలో వ్యతిరేకత చూపుతున్నారు. ఈ క్రమంలోనే ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్ కూడా అల్లు అర్జున్ అరెస్ట్ పై స్పందిస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు. అల్లు అర్జున్ అరెస్ట్ అక్రమమని వెంటనే ఆయననే విడుదల చేయాలి అంటూ డిమాండ్ చేశారు.

అల్లు అర్జున్ విడుదల చేయకపోతే కనుక రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 19 ప్రకారం తనకు వచ్చి హక్కుతో కోర్టులో రేపు ప్రజా ప్రయోజన వ్యాజ్యం వేస్తానని హెచ్చరించారు. ఈ మేరకు ఒక వీడియోను రిలీజ్‌ చేశారు. తొక్కిసలాటలో భాగంగా ఒక మహిళ అభిమాని చనిపోతే అల్లు అర్జున్ అరెస్టు చేశారు సరే మరి చంద్రబాబు నాయుడు ఎన్ని బహిరంగ ర్యాలీలను అలాగే సభలను ఏర్పాటు చేసినప్పుడు ఎంతోమంది చనిపోయారు మరి చంద్రబాబు నాయుడుని ఎందుకు అరెస్టు చేయలేదంటూ ప్రశ్నించారు.

గతంలో గోదావరి పుష్కరాల సమయంలో చంద్రబాబు నాయుడు కుటుంబానికి సుమారు 23 మందికి పైగా భక్తులు బలి అయ్యారు అప్పుడు చంద్రబాబు నాయుడుని ఎందుకని అరెస్టు చేయలేదు.నెల్లూరు జిల్లా కందుకూరులో చంద్రబాబు ర్యాలీ నిర్వహిస్తే 8 మంది మరణించారు.. గుంటూరులో ముగ్గురు చనిపోయారు. అప్పుడు చంద్రబాబు నాయుడుని అరెస్టు చేశారా విచారణకు పోలీస్ స్టేషన్ కి పిలిపించారా అంటూ ఈయన వరుసగా ప్రశ్నలు వేశారు.

చట్టం ఒకరికి ఒక విధంగా మరొకరికి మరొక విధంగా పనిచేస్తుందా రాజకీయ నాయకులకు ఒక విధంగా సినిమా సెలబ్రిటీలకు ఒక విధంగా చట్టం పనిచేస్తుందా అంటూ ఈయన ప్రశ్నించారు. అల్లు అర్జున్ అరెస్టు నేను తీవ్రంగా ఖండిస్తున్నాను..వెంటనే అల్లు అర్జున్‌ను విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. లేదంటే ఆయన్ను రిలీజ్‌ చేయాలని.. ఎందుకు అరెస్టు చేశారో చెప్పాలని కోర్టును ఆశ్రయిస్తానని హెచ్చరించారు.