పొలిటికల్ ప్రత్యర్థుల నోట… “శభాష్ పవన్” మాట!

రాజకీయాలు వేరు.. రాష్ట్రాభివృద్ధి వేరు. తనకు రాజకీయాలకంటే రాష్ట్రాభివృద్ధి ముఖ్యం. రాష్ట్రంలోని యువత భవిష్యత్తు ముఖ్యం. ఇంత హుందాతనమైన ఆలోచన జనసేన అధినేత పవన్ కల్యాణ్ కి వచ్చింది. అనుకున్నదే తడవుగా ఆ విషయాన్ని ట్విట్టర్ వేదికగా ప్రభుత్వంతోనూ – ప్రజలతోనూ పంచుకున్నారు. ఫైనల్ గా శభాష్ అనిపించుకున్నారు!

విశాఖ కేంద్రంగా పెట్టుబడిదారుల సదస్సు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా జనసేనాని పవన్ కల్యాణ్ హుందాతనంతో కూడిన ప్రకటన చేశారు. ప్రపంచ పెట్టుబడి దారుల సదస్సుకు వస్తున్న వారికి జనసేన స్వాగతం చెబుతోందని తెలిపిన పవన్… ఈ విషయంలో ప్రభుత్వానికి జనసేన పూర్తిగా సహకరిస్తుందని హామీ ఇచ్చారు. ఈ రెండు రోజులు ప్రభుత్వంపై ఎటువంటి రాజకీయ విమర్శలు చేయకూడదని నిర్ణయించుకున్నామని పవన్ స్పష్టం చేశారు.

విశాలమైన సముద్ర తీరం, అపారమైన ఖనిజ సంపద, పుష్కలమైన మానవ వనరులు ఉన్న అంశాలు పెట్టుబడిదారులకు తెలియచెప్పాలని ట్విట్టర్ వేదికగా తెలిపిన పవన్… విశాఖలో జరగుతున్న ఈ సదస్సు ద్వారా కేవలం విశాఖకే కాకుండా.. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలకు పెట్టుబడులను ఆహ్వానించాలని ప్రభుత్వానికి స్పష్టంచేశారు. అమరావతి, తిరుపతి, కాకినాడ, శ్రీకాకుళం, అనంతపురం, ఒంగోలు, కడప, నెల్లూరు వంటి ప్రాంతాల్లో ఉన్న అవకాశాలను కూడా పెట్టుబడిదారులకు తెలియచేయాలని సూచించారు.

రివర్స్ టెండర్లు, మధ్యవర్తుల కమిషన్లు వంటి అడ్డంకులు ఏమీ లేకుండా రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేలా వారికి భరసా కల్పించాలని చురకలతో కూడిన సూచనలు కూడా చేశారు పవన్! ఈ పరిణితే ఇప్పుడు పవన్ ని శభాష్ అనేలా చేస్తుంది. పొలిటికల్ ప్రత్యర్థులు సైతం… “శభాష్ పవన్” అని పొగిడేలా చేస్తుంది.

కానీ… 40 ఏళ్ల రాజకీయ అనుభవం అనిచెప్పుకునేవారికి మాత్రం ఈ జ్ఞానం, ఈ హుందాతనం, ఇలాంటి పరిణితి ఇసుమంతైనా లేకుండా పోయిందని ఈ సందర్భంగా బాబుపై సెటైర్లు వేస్తున్నారు ఏపీ ప్రజలు! అయినదానికీ కానిదనికీ అనవసర రాజకీయ విమర్శలే తప్ప… రాష్ట్రాభివృద్ధి విషయంలో సహకరించాలనే సృహ లేకుండా పోయిందని కామెంట్లు చేస్తున్నారు!

ఇక చివరిగా- రానున్న రెండు రోజుల్లో ప్రభుత్వంపై జనసేన ఎలాంటి విమర్శలకు చోటివ్వదు. ఇన్వెస్టర్ల సమ్మిట్‌ విషయంలో ప్రభుత్వం ఎటువంటి రాజకీయ విమర్శలు చేయం. పెట్టుబడుల ఆకర్షణ అంశంలో ప్రభుత్వానికి సంపూర్ధ మద్దతును అందిస్తోంది.(cont..)

— Pawan Kalyan (@PawanKalyan) March 2, 2023