JC Prabhakar Reddy: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జెసి ప్రభాకర్ రెడ్డి తరచూ వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలుస్తున్నారు. అయితే తాజాగా ఈయన అనంతపురం మాజీ ఎమ్మెల్యే అనంత వెంకట్రామిరెడ్డికి సీరియస్ వార్నింగ్ ఇస్తూ చేసిన కామెంట్స్ ప్రస్తుతం సంచలనగా మారాయి. ఫ్లైయాష్ విషయంలో జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి ప్రభాకర్ రెడ్డి మధ్య తీవ్ర విమర్శలు చేసుకుంటూ పార్టీ పరువును బజారుకీడుస్తున్నారు.
ఈ విషయంపై చంద్రబాబు నాయుడు జేసీకి వార్నింగ్ ఇచ్చినప్పటికీ ప్రభాకర్ రెడ్డి మాత్రం తగ్గేదేలే అనే విధంగా తనదైన శైలిలోనే పలువురు వైకాపా ఎమ్మెల్యేలకు వార్నింగ్ ఇస్తున్నారు.ఫ్లైయాష్ అంశంలో తనను విమర్శించిన మాజీ ఎమ్మెల్యే అనంత వెంకట్రామిరెడ్డిపై జేసీ ప్రభాకర్ రెడ్డి బూతు పురాణంతో రెచ్చిపోయారు. ఆర్టీపీపీ ఫ్లైయాష్ వివాదంతో నాకేం సంబంధం? అని ప్రశ్నించారు. రాష్ట్ర అభివృద్ధి కోసం సీఎం చంద్రబాబు కోపం.. తాపం.. రోషం ఉన్నా పక్కన పెట్టారు.
నేను చంద్రబాబు అంత మంచి వాడినైతే కాదు. నాకు కోపం తాపం రోషం కూడా ఉంది నాకు కొట్టడం కూడా తెలుసు. వైసీపీ ప్రభుత్వంలో టిడిపి వారిని దారుణంగా వేధించారు అయితే ప్రస్తుతం టిడిపి ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పటికీ కార్యకర్తలు నిరుత్సాహంగా ఉన్నారని.. ఎమ్మెల్యేలు, నాయకులు బయటకు రావాలని పిలుపునిచ్చారు. ఇక తమ పార్టీ అధినేత, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణిని విమర్శించిన వారిని ఇంటికి వచ్చి మరి చెప్పుతో కొడతా అంటూ ఈయన వార్నింగ్ ఇచ్చారు.
ఇక ధర్మవరం తాడిపత్రి మాజీ ఎమ్మెల్యేలను వెనకేసుకొస్తున్న అనంత వెంకట్రామిరెడ్డికి కూడా ఈయన వార్నింగ్ ఇచ్చారు.మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి సంగతి త్వరలోనే తేలుస్తా అని జేసీ ప్రభాకర్ రెడ్డి హెచ్చరించారు. అనంత వెంకటరామిరెడ్డిని ఊరు విడిపిస్తానని వార్నింగ్ ఇచ్చారు. డిసెంబర్ 4వ తేదీ లేదా 5వ తేదీ అనంత వెంకట్రాంరెడ్డి ఇంటికి వెళ్లి మరి తన ఇంటి గేట్లు అన్నిటిని పగలగొడతాను అంటూ జేసీ ప్రభాకర్ రెడ్డి చేసిన ఈ వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.