ఒక వారం రోజులుగా అనంపురం జిల్లాలో ఒకటే పుకారు. అనంత పురం జిల్లా పెద్ద రెడ్డి గా పేరున్న జెసి దివాకర్ రెడ్డి టిడిపి వదిలేసి వైకాపాలోచేరతారని.
పవర్ లో లేకపోయినా ఆయన జిల్లాలో చాలా వపర్ ఫుల్. అయితే, పొలిటిషన్ కు అది చాలాదు. అమరావతి సెక్రెటేరియట్ ఛేంబర్ లో కూర్చునే పవర్ కావాలి. జెసి దివాకర్ రెడ్డి కుటుంబానికి టిడిపి హయాంలో ఆ యోగం దక్కలేదు. ఆయన ఎంపి, అయినా ఎన్డీయే రోజుల్లో కేంద్రంలో మంత్రి కాలేకపోయారు .
ఆయన తమ్ముడు జెసి ప్రభాకర్ రెడ్డి తాడిపత్రి ఎమ్మెల్యే. ఆయన రాష్ట్రంలో మంత్రి కాలేకపోయారు. పర్ ఫామెన్స్ తీసుకుంటే, ప్రభాకర్ రెడ్డికి మంచి మార్క్ లొస్తాయి. తా డిపత్రిని ఆయన బెస్ట్ టౌన్ తీర్చిదిద్దారు. అయినా గుర్తింపురాలేదు. జెసి బ్రదర్స్ కు వచ్చిన గుర్తింపంతా వివాదాలతోనే. జగన్ ను విపరీతంగా గిల్లుకుని, టిడిపి, చంద్రబాబునాయుడిని ఎబ్బెట్టుగా పొగిడిపొగిడి జెపి దివాకర్ రెడ్డి వార్తల్లో ఉన్నారు.
ప్రభాకర్ రెడ్డి కూడా వివాదాలతోనే వార్తల్లో ఉన్నారు. పైకి టిటిడిలోనే ఉన్నా లోన వాళ్లిద్దరు అంత హ్యాపీగా లేరని జిల్లాలో అనుకుంటున్నారు. అదేమిటో వాళ్లంటే జిల్లా టిడిపిలో కూడా వాళ్లకి బాగా ప్రత్యర్థులున్నారు. ఇక వైసిపి వాళ్లయితే ఆయన మీద కత్తులు, కారాలు, మిరియాలు నూరుతూనే ఉన్నారు. అయినా సరే పార్టీలు మారేందుకు తిట్లు శాపనార్థాలు విమర్శలు అడ్డు రావు. అన్ని తుడిచేసుకుని పార్టీ మారవచ్చు.
అలాంటి అనుమానంతోనే నేమో దివాకర్ రెడ్డి వై ఎస్ ఆర్ కాంగ్రెస్ లో చేరబోతున్నారని వారం రోజులగా అనంతపురం ఒకటే పుకారు.
తెలుగుదేశం పార్టీలో ఆయన ఇమడలేక పోతున్నారని,పార్టీ మాారాల్సిందేననే నిర్ణయానికి వచ్చారని, వైసిపి కండువా కప్పుకునేందుకు ఈనెల 28న ముహూర్తం కూడా ఖరారైనట్లు ఒకటే చర్చ.
ఈ వాదనలకు బలం చేకూర్చే సంఘటన ఒకటి జరిగింది. అనంతపురం లో ఫ్లైఓవర్ ప్రారంభోత్సవ తేదీ ని ఆయన అట్టహాసంగా ప్రకటించేశారు. ఎంపిగా ఆయన స్వేచ్ఛ తీసుకున్నారు. తర్వాత దాని ఊసేలేదు.. ఇలాగే నగరంలో రోడ్డు వెడల్పు కార్యక్రమం కూడా వాయిదా పడింది. అవన్నీ హై కమాండ్ జోక్యంతో ఆగిపోయాయని, దీనిని ఆయన అవమానంగా భావిస్తున్నారని అందుకే పార్టీ ని ఉడాయించాలనుకుంటున్నారని జస్టిఫికేషన్ కూడా వినిపించింది.
అయితే ఈ వార్తలన్నీ కేవలం పుకార్లేనా అనుకునేలా జేసీ దివాకర్ రెడ్డి కుమారుడు పవన్ రెడ్డి గురువారం మంత్రి నారా లోకేష్ తో సమావేశమయ్యారు.
ఈ సమావేశంలో జిల్లాలోపార్టీ బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యల గురించి ఇరువురు చర్చించారుట. ఈ సమావేశం గురించి చెబుతూ తన తండ్రి పార్టీ మారే విషయం మీద మాట్లాడుతూ తాము తెలుగుదేశం తామంతా పార్టీలోనే కొనసాగుతామని, ఎటువంటి పరిస్థితుల్లో పార్టీ వీడే ప్రసక్తే లేదని పవన్ రెడ్డి అ న్నారు.
జిల్లాలో జరుగుతున్నదని దుష్ప్రచారమని, కొందరు పనిగట్టుకుని చేస్తున్నారని ఆయన అన్నారు.