జయలలిత ఆసుపత్రి బిల్లు ఎంతో తెలుసా ?

తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి శ్రీమతి జయలలిత ఆసుపత్రి బిల్లు ఎంతో తెలుసా ?

అక్షరాలా 6. 85 కోట్లు . జయలలిత  2016లో అనారోగ్యంతో చెన్నైలో ని అపోలో ఆసుపత్రిలో చేరారు .  75 రోజులపాటు ఆమె అపోలో ఆసుపత్రిలోనే ఉండి డిసెంబర్ 5న కన్ను మూశారు . జయలలిత మృతిపై దర్యాప్తు చేస్తున్న బృందాన్ని ఈ వార్త శోకేకింగ్కు గురి చేసింది . ఇదే వార్త సోషల్ మీడియాను కుదిపేస్తోంది .

అయితే ఆమె చనిపోయిన తరువాత ఏ ఐ ఏ డి ఎమ్ కె  గత సంవత్సరం జూన్ 15 వ తేదీన అపోలో కు 6 కోట్లను చెల్లించినట్టు ఈ బృందం తెలిపింది.

అయితే అంతకు ముందు అపోలోకు 41. 13 లక్షల రూపాయలను చెల్లించినట్టు ఆసుపత్రి వర్గాలు పేర్కొన్నాయి . ఎవరు చెల్లించారనే  ఆధారాలు లేవు .

75 రోజులకుగాను ఆహార పదార్ధాలకు 1,17,04, 925 రూపాయలు ఖర్చు అయ్యిందని ఆ బిల్లులో పేర్కొనడం జరిగింది. ఈ బిల్లు వార్త బయటకు రావడంలో తమ ప్రమేయం లేదని జస్టిస్ ఆరుముగా స్వామి , ఆసుపత్రి వర్గాలు తెలిపాయి . గత నెల 27వ తేదీన ఆసుపత్రి కమిషన్ కు పంపిన ఏ బిల్ ఎలా బయటకు వచ్చిందో ఎవరు చెప్పడం లేదు . మాకు తెలియాంటే మాకు తెలియదని చెబుతున్నారు