గింజుకుంటోన్న టీడీపీ.! జనసేనాని ఇలా దెబ్బ కొట్టాడేంటీ.?

Janasenani

తెలుగుదేశం పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నేత నారా చంద్రబాబునాయుడికి కంటి మీద కునుకు లేకుండా చేసే డైలాగ్ పేల్చారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. ‘2014లో నేను తగ్గి, మీకు అధికారం వచ్చేలా చేశాను. ఈసారి మీరు తగ్గాలి..’ అంటూ టీడీపీకి జనసేనాని నేరుగానే ఇచ్చిన సలహా, చేసిన సూచన.. ఒక రకంగా స్వీట్ వార్నింగ్ లాంటిదేనని చెప్పక తప్పదు.

ప్యాకేజీ ఎక్కువ డిమాండ్ చేయడానికి వీలుగా జనసేనాని ఈ వ్యాఖ్యలు చేశారన్నది వైసీపీ శ్రేణులు సోషల్ మీడియాలో జనసేనాని మీద చేస్తున్న విమర్శల సారాంశం. అయితే, టీడీపీ మాత్రం జనసేనాని వ్యాఖ్యల విషయంలో కంగారు పడుతోంది. టీడీపీ అధినేత చంద్రబాబు అయితే, ఈ విషయం విన్న వెంటనే షాక్‌కి గురయ్యారట.

జనసేనకు వేరే దారి లేదు, టీడీపీతో పొత్తుకు రావాల్సిందేనన్న ఆలోచనతో చంద్రబాబు వున్నారు. పైకి, రాజకీయ వలపు బాణాల్ని జనసేనాని మీదకు సంధిస్తున్నట్లుగా కనిపిస్తున్నా, తెరవెనుకాల మాత్రం, పాతిక సీట్ల కంటే ఎక్కువ జనసేనకు ఇచ్చే ఛాన్సే లేదంటూ చంద్రబాబు వ్యూహ రచన చేస్తున్నారు పొత్తులకు సంబంధించి.

ఈ నేపథ్యంలోనే జనసేన అధినేత పవన్ కళ్యాణ్, తనదైన స్టయిల్లో టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడికి షాక్ ఇచ్చారు. ‘ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు.?’ అన్న భావనలో వున్నారు చంద్రబాబు. 2024 ఎన్నికల్లో టీడీపీ ఓడిపోతే, తెలుగుదేశం పార్టీ రాజకీయంగా సమాధి అయిపోతుంది. నారా లోకేష్ రాజకీయ భవిష్యత్తు కూడా అంతే.

మరిప్పుడు, చంద్రబాబు ముందున్న ఆప్షన్ ఏంటి.? ఏమీ లేవ్.. నేరుగా జనసేనకు టీడీపీ మద్దతిచ్చి తీరాల్సిందే.