వారాహి విజయ యాత్రలో భాగంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్, ఎక్కడికక్కడ మంచి మంచి ప్రసంగాలతోనే జనాన్ని ఆకట్టుకుంటున్నారు. అందుకే, ఆయన నిర్వహిస్తున్న బహిరంగ సభలకు వయసుతో సంబంధం లేకుండా జనం.. అందునా, ఓటర్లు హాజరువుతున్న మాట వాస్తవం.
గతంతో పోల్చితే, జనసేన పార్టీలో వచ్చిన చాలా పెద్ద మార్పు ఇది. ఒకప్పుడు ఓటు హక్కు లేనివారే జనసేన పార్టీ సభల్లో ఎక్కువగా కనిపించేవారు. ఈసారి ఓట్లేసేవాళ్ళు ఎక్కవగా కనిపిస్తున్నారు.
మరి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేస్తున్నదేంటి.? అప్పటిదాకా బాగానే మాట్లాడుతూ, ఒక్కసారిగా సంయమనం కోల్పోతున్నారు. సినిమాల్లో హైపర్ ఎనర్జీ చూపించినట్లే.. అక్కడక్కడా ఆ ఓవర్ హైపర్ ఎనర్జీ ప్రదర్శించి, తనను తాను సెల్ఫ్ డిస్ట్రక్షన్ మోడ్‌లోకి నెట్టేసుకుంటున్నారు.
అమలాపురం బహిరంగ సభ చివర్లో జనసేనాని ఇచ్చిన టచ్.. కొంతమందిని విస్మయానికి గురిచేసింది. ‘ఇదేం వెర్రి.?’ అని కొందరు ఆశ్చర్యపోయారు. కత్తిపూడి నుంచి మొదలైన వారాహి యాత్రలో.. అమలాపురం బహిరంగ సభ చాలా చాలా స్పెషల్. అక్కడ ఇంకాస్త జాగ్రత్తగా పవన్ కళ్యాణ్ వ్యవహరించి వుంటే బావుండేదని పవన్ కళ్యాణ్ అభిమానులే సోషల్ మీడియాలో స్పందిస్తున్నారు.
నాయకుడిగా ఇంకా జనసేనానిలో పరిణతి రాలేదంటూ వయసు మీద పడ్డ కొందరు (అమలాపురం బహిరంగ సభకు హాజరైనవారు) అభిప్రాయపడటం కనిపించింది.
అసలు జనసేనాని ఎందుకలా ఊగిపోతుంటారు.? అదొక మిలియన్ డాలర్ క్వశ్చన్.