వారాహి రెండో దశ ఫిక్స్… తెరపైకి కొత్త సందేహం!

ఇప్పట్లో ఉంటుందో ఉండదో అనే కామెంట్లు వస్తున్న తరుణంలో.. మరోపక్క నిర్మాతలు ఇబ్బందిపడుతున్నారని వార్తలొస్తున్న సమయంలో రెండో దశ వారాహికి ట్విట్టర్ వేదికగా తేదీ, వివరాలు అందించారు జనసేన రాజకీయ కార్యదర్శి పి. హరిప్రసాద్. అయితే ఇక్కడ ఒకటే సభను నిర్వహిస్తుండటంపై కొత్త చర్చ తెరపైకి వచ్చింది.

ఇప్పటికే ఉమ్మడి తూర్పుగోదావరిజిల్లాలో 8 నియోజకవర్గాలు అవిరామంగా పర్యటించిన జనసేన అధినేత… పశ్చిమ గోదావరి జిల్లాకు వచ్చేసరికి నరసాపురం, భీమవరాల్లో సభలు నిర్వహించారు. ఇలా సెలక్ట్విగా కొన్ని నియోజకవర్గాల్లోనే యాత్ర చేయడం, మరికొన్ని చోట్ల మాత్రమే సభలు నిర్వహిస్తుండటం పై పలు సందేహాలు వచ్చిన సంగతి తెలిసిందే.

జనసేన యాత్ర జరిగిన నియోజకవర్గాల్లోనే ఆ పార్టీ పోటీ చేయబోతోందని ఒక చర్చ తెరపైకి వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సందేహాలకు మరింత బలం చేకూర్చేలా తాజాగా జనసేన నుంచి తాజాగా ఒక ప్రకటన వచ్చింది. అందులో… ఈనెల 9నుంచి వారాహి సెకండ్ సీజన్ మొదలవుతుందని.. ఈసారి యాత్ర ఏలూరు నుంచి ప్రారంభమవుతుందని తెలిపింది.

అయితే ఆ రోజు ఏలూరులో పవన్ కల్యాణ్ బహిరంగ సభ ఉండనుందని ప్రకటించింది. అంతవరకూ బాగానే ఉంది కానీ… ఏలూరుతో పాటు దెందులూరు, తాడేపల్లిగూడేం, ఉంగుటూరు, తణుకు నియోజకవర్గాల్లో నాయకులను కలిసి స్థానిక రాజకీయాలపై మాట్లాడతారని తెలిపింది. దీంతో… నరసాపురం, భీమవరం అనంతరం మిగిలిన పశ్చిమగోదావరి జిల్లా అసెంబ్లీ నియోజకవర్గాలను షార్ట్ కట్ లో కవర్ చేసి ముగించేస్తున్నారని అంటున్నారు పరిశీలకులు.

తో పశ్చిమగోదావరి జిల్లాల్లో నరసాపురం, భీమవరం, ఏలూరు నియోజకవర్గాల్లో మాత్రమే జనసేన పోటీ చేయబోతుందా అనే సందేహాలు తెరపైకి తెస్తున్నారు విశ్లేషకులు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో మాత్రం పక్కాగా షెడ్యూల్ ప్రకటించిన జనసేన… రెండో షెడ్యూల్ విషయంలో ఇలాంటి నిర్ణయం తీసుకోవడం వెనక కారణం ఇదే అయ్యి ఉంటుందని అంటున్నారు.

మరి ప్రస్తుతం ప్రకటించినట్లు మిగిలిన పశ్చిమగోదావరి జిల్లాలన్నింటికీ ఏలూరులో ఒకటే మీటింగ్ పెట్టి మమ అనిపించేస్తారా.. లేక, 9వ తేదీ అనంతరం మిగిలిన ష్యెడ్యూల్ కూడ ప్రకటించి… పోటీచేయబోయే స్థానలపై మరింత క్లారిటీ ఇస్తార అనేది వేచి చూడాలి!