హరికృష్ణ మృతిపై పవన్ సంతాపం, జనసేన కార్యక్రమాలు రద్దు

హీరో నందమూరి హరికృష్ణ మృతికి జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ సంతాపం ప్రకటించారు. ఉదయాన్నే హరికృష్ణ గాయ పడ్డారని వినాల్సి వచ్చిందని, ఆయన కోలుకుంటారని అనుకునేలోపు ఆయన మరణ వార్త వినాల్సి వచ్చిందవి పవన్ విచారం వ్యక్తం చేశారు. భగవంతుడు వారి కుటుంబ సభ్యులకు ధైర్యాన్ని ఇవ్వాలని ఆయన ప్రార్ధించారు. ఈ రోజు జనసేన ఆఫీసులో జరిగే కార్యక్రమాలు, పార్టీలో చేరికలు, గిడుగు రామమూర్తి జయంతి కార్యక్రమాలను రద్దు చేస్తున్నట్టు జనసేన ప్రకటించింది. హరికృష్ణ మృతికి సంతాపంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విడుదల చేసిన లేఖ కింద ఉంది చదవండి.