జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వేర్వేరు సందర్భాల్లో చేసే కామెంట్ల విషయంలో ప్రజల్లో భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. తాజాగా పవన్ కళ్యాణ్ నోటా గురించి షాకింగ్ కామెంట్లు చేయగా ఆ కామెంట్లు వైరల్ అవుతున్నాయి. పోటీ చేసిన అభ్యర్థుల్లో ఏ అభ్యర్థి నచ్చకపోతే చాలామంది నోటాకు ఓటు వేయడం ద్వారా తమ అభిప్రాయాన్ని వ్యక్తపరుస్తూ ఉంటారనే సంగతి తెలిసిందే. కొంతమంది నోటా అంటారని మరి కొందరు ఆ పార్టీ ఇష్టం లేదని ఈ పార్టీ ఇష్టం లేదని చెబుతారని పవన్ చెప్పుకొచ్చారు.
మరి కొందరు మేం మేధావులం అని చెప్పి నోటాకు ఓటు వేస్తారని అయితే నోటాకు ఓటు వేసి ఏం సాధించారని పవన్ ప్రశ్నించారు. నోటాకు వేసే వాళ్లు నాకు ఈ దేశం నచ్చలేదని పాస్ పోర్టును చింపేసుకోవాలని పవన్ చెప్పుకొచ్చారు. ఉన్నవాళ్లలో ఎవరో ఒకరికి ఓటు వేయాలని పవన్ సూచనలు చేశారు. ఓడిపోయేవాడికి ఓటేస్తే ఓటు వేస్ట్ అవుతుందని వీళ్లు చెబుతారని పవన్ కళ్యాణ్ చెప్పుకొచ్చారు.
2019 ఎన్నికల్లో పది శాతం మంది నోటాకు వేటు వేశారని క్రిమినల్స్ రాజ్యమేలటానికి నోటాకు ఓటు వేసిన వాళ్లే కారణమని పవన్ కళ్యాణ్ కొత్త లాజిక్ చెప్పారు. మార్పు కోసం చూసే వాళ్లు జనసేనకు ఓటు వేస్తే వాళ్లకు ప్రశ్నించే హక్కు వస్తుందని పవన్ తెలిపారు. ఎవరికో ఒకరికి ఓటు వేయాలని పవన్ కళ్యాణ్ కోరడం గమనార్హం. అయితే రాజ్యాంగం, ఎన్నికల కమిషన్ ఇచ్చిన హక్కును వినియోగించుకోవద్దని చెప్పడానికి పవన్ ఎవరని కొంతమంది కామెంట్లు చేస్తున్నారు.
పవన్ కళ్యాణ్ నిలకడ లేని మనిషి అని జనసేన అధికారంలోకి వచ్చినా ప్రజలకు మంచి జరగకపోతే అప్పుడు పవన్ ఏమని సమాధానం చెబుతారని మరి కొందరు కామెంట్లు చేస్తున్నారు. ప్రజలు నమ్మని పార్టీ గురించి ప్రచారం చేస్తూ పవన్ కళ్యాణ్ ప్రజలకు దూరమవుతున్నాడని మరి కొందరు కామెంట్లు చేస్తున్నారు. పజల కామెంట్ల విషయంలో పవన్ ఏ విధంగా రియాక్ట్ అవుతారో చూడాల్సి ఉంది. పవన్ కామెంట్లను చూసి జనసేన రాజకీయాలు అర్థం కావని కొందరు నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.