అసలు టీవీ9 మీద పవన్ కళ్యాణ్ కు ఎందుకు కోపం వచ్చింది? అసలు బాగోతం ఇదే!

Pawan Kalyan plans big thing for Janasena

మీడియా ప్రథమ కర్తవ్యం ఏంటంటే సమాచారం ఇవ్వడం. తనకు తెలిసిన సమాచారాన్ని తన తెలివితో అనలైజ్ చేసి తెలియని వాళ్లకు చెప్పడమే మీడియా. ఇది బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ మీడియా. మీడియా అనేది ప్రచార భటులు, కర పత్రాలు, బుక్స్, పెయింటింగ్స్, న్యూస్ పేపర్స్, న్యూస్ చానెల్స్ అంటూ ఇలా అభివృద్ధి చెందుతూ ఇప్పుడు డిజిటల్ మీడియా వరకు వచ్చింది. అయితే మీడియా అనేది ఇలా అభివృద్ధి చెందుతున్న క్రమంలో తన అసలు స్వరూపాన్ని కోల్పోయింది. సమాచారాన్ని ఇవ్వాల్సిన మీడియా ప్రజల మనోభావాలతో ఆడుకోవడం ప్రారంభించింది.

అసలు విషయాన్ని పక్కన పెట్టి ప్రజలను ఎమోషినలైజ్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు. ప్రజలను ఎమోషినలైజ్ చేయాలన్న ప్రయత్నంలో కులలాలకు, పార్టీలకు, మతాలకు అమ్ముడుపోవాల్సి వస్తుంది. అలా అమ్ముడుపోతు సిగ్గు లేకుండా పార్టీల, మతాల యొక్క అజెండాను మోస్తున్నారు.

తెలుగు రాష్ట్రాల్లో ఒక్క నిజాయితీ కలిగిన ఛానల్ గాని దిన పత్రిక కూడా కనిపించదు. ప్రతి ఛానల్ ఎదో ఒక పార్టీకి మద్దతు తెలుపుతూ సిగ్గు లేకుండా బహిరంగంగానే కథనాలు రాస్తూ ఉన్నారు. మన తెలుగు ప్రజలకు ఉపయోపడే న్యూస్ తప్ప మిగితా చెత్తను ప్రచారం చేసే చానెల్స్ చాలా ఉన్నాయి. ఆ చానెల్స్ కు కావలసింది టీఆర్పీ రేటింగ్స్. రేటింగ్స్ కోసం ఎవరినైనా రోడ్ మీదకి లాగుతాయి, అవసరమైతే అమ్మాయిల చేత రోడ్ మీద బట్టలు కూడా విప్పిస్తారు.ఎవరైన ప్రముఖులు చనిపోతే వాళ్ళు ఎలా చనిపోయారనే విషయంపై కూడా బాత్ టాబ్ లలో పడుకొని మరీ కథనాలు ప్రచారం చేస్తారు. ప్రముఖులను తిట్టడానికి మాంచి లైవ్ వేదికను కలిపించి మరీ వేడుక చూస్తారు. ఇదిలా ఉంటే ఇప్పుడు జనసేన కార్యకర్తలు టీవీ9పై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు.

ఎందుకంటే ఒక నటిని వాళ్ళ ఛానల్ కు పిలిచి ఆమెతో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను తిట్టించారు. ఈ కార్యక్రమం ప్రచారం కావడంతో తమ నాయకుడైన పవన్ కళ్యాణ్ తిట్టడంతో జనసేన నాయకులు తీవ్ర ఆగ్రహంతో ఊగిపోతున్నారు. షేమ్ లెస్ మీడియా అంటూ పవన్ కళ్యాణ్ అభిమానులు ట్విట్టర్ లో ట్రెండ్ చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ మీద టీవీ9 కావాలనే ఈ కుట్ర పూరిత చర్యను పాల్పడిందని జనసేన కార్యకర్తలు చెప్తున్నారు. ఈసారి ఎలాగైనా టీవీ9 కు బుద్ది చెప్తామని వెల్లడిస్తున్నారు. ఇప్పటి వరకు పవన్ కళ్యాణ్ బర్త్ డే ను ట్రెండ్ చేసిన పవన్ కళ్యాణ్ అభిమానులు ఇప్పుడు టీవీ9 మీద కోపంతో షేమ్ లెస్ మీడియా అంటూ వైరల్ చేస్తున్నారు. జనసేన కార్యకర్తల ఆగ్రహం వెనక అర్థం ఉందని మిగితా పార్టీ నేతలు కూడా ఈ ట్రెండ్ లో పాల్గొన్నారు.