అక్టోబర్ 15 న రాజమండ్రిలోని ధవళేశ్వరం బ్యారేజి పై జనసేన పార్టీ భారీ కవాతు నిర్వహించనుంది. అందులో భాగంగా జనసేన కవాతు పాటను విడుదల చేసింది. అదే రోజున పద పద పద జనసేన జనంలోకి అనే పాటను పవన్ విడుదల చేయనున్నారు. పాటలోని ఉద్దేశ్యాలన్నీ కవాతు ఉద్దేశ్యాన్ని తెలియజేసేలా ఉండనున్నాయని పవన్ తెలిపారు. ఈ పాటను తమన్ స్వరపరచగా రామజోగయ్య శాస్త్రీ రచించారు. కవాతు పాట కింద ఉంది చూడండి.