జనసేన పార్టీ ఎన్నికల గుర్తుగా గ్లాసును కేటాయించింది ఎన్నికల సంఘం. గ్లాసును కేటాయించినప్పటి నుండి జనసేన అధినేత పవన్ కళ్యాణ్, జనసేన నాయకులూ, కార్యకర్తలు, అభిమానులు తమ పార్టీ గుర్తును ప్రజల్లోకి తీసుకెళ్లడానికి కొత్త కొత్త ప్రయోగాలు చేస్తున్నారు. జనసేన శ్రేణులు టీ, కాఫీలు తాగుతూ ఫోటోలు పెట్టి ప్రమోట్ చేస్తున్నారు. ఓల్డ్ ఈజ్ గోల్డ్ లా అయింది జనసేన గుర్తు. ఇదివరకు రోజుల్లో టీ స్టాళ్లలో, హోటళ్లలో గాజు గ్లాసుల్లోనే టీ అందించేవారు. ట్రెండ్ మారి కొత్త కొత్త ఫ్యాషన్స్ రావడంతో ఈ గాజు గ్లాసుల్లో టీ ఇవ్వడం చాలా అరుదుగా మారిపోయింది. జనసేనకు గ్లాసు గుర్తు కేటాయించడంతో ఇప్పుడు అదే తాజా ట్రెండ్ అయిపోయింది. జనసేన నేతలు జనసేన గుర్తు గ్లాసు అని ప్రజలకు అవగాహన కలిగేలా ప్రచారం చేస్తున్నారు.
ఈ నేపథ్యంలో జనసేన గుర్తు గ్లాసు అంటూ కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నంలో జనసేన నాయకులూ అవగాహన ఆదివారం ర్యాలీ చేశారు. జనసేన పార్టీ గ్లాసు గుర్తుకే ఓటు వేయాలంటూ గాజు గ్లాసులతో ప్రదర్శన చేపట్టారు. ఈ సందర్భంగా జనసేన నాయకుడు డేవిడ్ రాజు మీడియా ఎదుట మాట్లాడారు. టీడీపీ నాయకులపై ఆయన విమర్శలతో మండిపడ్డారు. ఆయన ఏం మాట్లాడారో ఆయన మాటల్లోనే కింద ఉంది చదవండి.
విలాసవంతమైన జీవితాన్ని వదిలి పేదల కోసం రాజకీయాల్లోకి వచ్చిన వ్యక్తి పవన్ కళ్యాణ్. కలుషితమైన రాజకీయాల్లో పెనుమార్పులు రావాలంటే ప్రతి ఒక్కరూ జనసేనకు ఓటువేయాలి. ప్రజా సమస్యలపై అసెంబ్లీలో ప్రశ్నించాల్సిన జగన్ పార్టీ రోడ్లపై తిరుగుతూ రాజకీయాలను అవహేళన చేస్తున్నారు. పేదల రాజ్యం రావాలంటే పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తి సీఎం కావాలి. అంబేద్కర్ అడుగుజాడల్లో నడుస్తున్న వ్యక్తి పవన్. నాలుగేళ్ళ క్రితం పవన్ అడ్డుపెట్టుకొని అధికారం లోకి వచ్చిన టీడీపీ మంత్రులు నాయకులు పవన్ పై మాటల దాడి చేయటం సిగ్గు చేటు. ఇబ్రహీంపట్నం లో జనసేన బ్యానర్లు తొలగిస్తూ కొందరు టీడీపీ కార్యకర్తలు పైశాచిక ఆనందం పొందుతున్నారు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు డేవిడ్ రాజు. దీనికి సంబంధించిన వీడియో కింద ఉంది చూడండి.