అది ‘జనసేన’…ఇది ‘జై సేన’

పవన్ కళ్యాణ్ ఎలక్షన్స్ ఓడిపోయి ఉండవచ్చు కానీ ఆయన అభిమానుల మనస్సులో మాత్రం ఆయన నెంబర్ వనే. అలాగే పవన్ అభిప్రాయాలకు, ఆలోచనలకు అన్ని వర్గాల్లో పాజిటివ్ స్పందన ఉంది. అవన్ని గమనించి ఆయన భావాలను ప్రతిబింబించేలా ఓ చిత్రం రెడీ చేసారు సీనియర్ దర్శకులు వి సముద్ర. ‘జై సేన’ అనే టైటిల్ తో రూపొందే ఈ చిత్రం త్వరలో విడుదల కానుంది.

దర్శకుడు వి.సముద్ర మాట్లాడుతూ.. ‘‘పవన్‌కల్యాణ్‌ స్థాపించిన పార్టీ ‘జనసేన’. అది ఆయన రాజకీయ ఆశయాలకు సంబంధించినది. మా సినిమా ‘జై సేన’ ఆయన భావాలకు సంబంధించిన చిత్రం. అయితే ఆయన అభిమానంతో చేసే కొన్ని మంచి పనులను ఇందులో చూపిస్తున్నాం. నా ప్రతి సినిమాలో సామాజిక అంశాలున్నట్లే ఇందులో కూడా సోషల్‌ కాజ్‌ ఉంటుంది.

మాకు మా యూనిట్‌కు చాలా మంచి పేరు తెచ్చే సినిమా అవుతుంది. రవిశంకర్‌ బ్రహ్మాండమైన పాటలను అందించారు. కో ప్రొడ్యూసర్‌ శిరీష్‌ రెడ్డిగారు అన్ని విషయాల్లో నాకు బ్యాక్‌బోన్‌లా నిలిచారు. అన్ని కార్యక్రమాలను పూర్తి చేసి సినిమాను వచ్చే నెలలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం. అందరూ మా బ్యానర్‌ను.. ఇందులో పరిచయం అవుతున్న హీరోలను ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను’’ అన్నారు.