ఆ భరోసాను కల్పించడంలో జగన్ సర్కార్ విఫలం.. ఖర్చు పెట్టి వృథానేనా?

CM Jagan

ప్రభుత్వ బడుల కోసం కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నామని జగన్ సర్కార్ పలు సందర్భాల్లో సంచలన ప్రకటనలు చేస్తున్న సంగతి తెలిసిందే. జగన్ సర్కార్ చెప్పిన విధంగానే స్కూళ్ల రూపురేఖలు మార్చడం కోసం కోట్ల రూపాయలు ఖర్చు చేస్తుండటం గమనార్హం. ప్రభుత్వ బడులలో విద్యార్థుల సంఖ్య గణనీయంగా పెరిగిందని జగన్ సర్కార్ చెబుతుండగా అదే సమయంలో ప్రభుత్వ బడులలో ఫలితాలు గణనీయంగా తగ్గాయనే సంగతి తెలిసిందే.

ఏపీ సర్కార్ తరగతుల విలీనంతో రాష్ట్రంలోని వందల సంఖ్యలో పాఠశాలలు మూతబడ్డాయి. విద్యార్థుల సంఖ్య పెరిగిందని ప్రభుత్వం చెబుతున్నా గతేడాదితో పోల్చి చూస్తే విద్యార్థుల సంఖ్య 4 లక్షలు తగ్గిందని సమాచారం అందుతోంది. ఏపీ పదో తరగతి ఫలితాలతో పోల్చి చూస్తే తెలంగాణలో మెరుగైన ఫలితాలు వచ్చాయనే సంగతి తెలిసిందే. ఏపీలో టీచర్లపై అదనపు భారం పడటమే ఇందుకు కారణమని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

జగన్ సర్కార్ ఇంగ్లీష్ మీడియంను ప్రవేశపెట్టడం మంచి నిర్ణయమే అయినా ఇంగ్లీష్ మీడియంలో అద్భుతంగ బోధించే సామర్థ్యం ఉన్న టీచర్ల సంఖ్య తక్కువగా ఉండటంతో సమస్య మొదలైంది. జగన్ సర్కార్ ఇంగ్లీష్ మీడియంతో పాటు తెలుగు మీడియంను కూడా కొనసాగించి ఉంటే బాగుండేదనే భావన కొంతమందికి ఉంది. ఈ కామెంట్ల గురించి జగన్ సర్కార్ ఏ విధంగా రియాక్ట్ అవుతుందో చూడాల్సి ఉంది.

ఈ ఏడాది కూడా పది పరీక్షల్లో ఆశించిన ఫలితాలు రాని పక్షంలో ఏపీ ప్రభుత్వం పరువు పోవడం ఖాయమని చెప్పవచ్చు. ఏపీ సర్కార్ ఈసారి కరోనాను కూడా కారణంగా చూపే అవకాశం అయితే లేదనే సంగతి తెలిసిందే. పది పరీక్షల్లో పాస్ పర్సంటేజ్ పెరిగే విధంగా జగన్ సర్కార్ అడుగులు వేస్తే మంచిదని చెప్పవచ్చు. మంచి ఫలితాలు రాని పక్షంలో జగన్ సర్కార్ నాడు నేడు స్కీమ్ కోసం ఖర్చు చేసిన కోట్ల రూపాయలు కూడా వృథానే అని చెప్పవచ్చు.