రాజమండ్రి వైసీపీ లో అసంతృప్తి జ్వాలలకు తెరలేచిందా? అంటే అవుననే తెలుస్తోంది. పార్టీలో ఇప్పటికే అసమ్మతి సెగ రేగిన సంగతి తెలిసిందే. తాజాగా రాజమండ్రి వ్యవహారంతో అది పతాక స్థాయికి చేరుకున్నట్లే కనిపిస్తోంది. రాజమండ్రి కమీషనర్ అభిషిక్త్ కిషోర్ కు-వైసీపీ సిటీ ఇంచార్జ్ శివరామ సుబ్రమణ్యంకు మద్య కొన్నాళ్లగా కోల్డ్ వార్ నడుస్తోంది. కరోనాతో అది మరింత ముదిరినట్లు తెలుస్తోంది. రాజమండ్రిలో కరోనా కట్టడి చేయడంలో కమిషనర్ విఫలమయ్యారని, శిమ రామ ఆరోపించారు. నగరంపై అవగాహన లేకపోవడం వల్ల వచ్చిన సమస్య అని అన్నారు. ఆసుపత్రిలో బెడ్స్ ఉన్నా వాటిని కేటాయించడంలో సరైన చర్యలు తీసుకోవడంలో విఫలమయ్యారన్నారు.
పేద గర్భీణీలకు అవసరమయ్యే కేంద్రాలను కొవిడ్ సెంటర్ల గామార్చడం ఏంటని ప్రశ్నించారు. సాధారణ రోగాలువస్తే ఏ ఆసుపత్రికి వెళ్లాలని ప్రశ్నించారు. రాజమండ్రి రోడ్ల విస్తరణ పనుల్లో కమీషనర్ కల్పించుకోవడం… అదీ పేదల పాలిట ప్రశ్నించిన ప్పుడు తమకు ఎదురు చెప్పినట్లు వైసీపీ నేతలు అరోపించారు. అయితే ఇవే సమస్యలను టీడీపీ నేతలు వినతి పత్రం అందిస్తే ఈ విషయాన్ని కమీషనర్ ప్రభుత్వం దృష్టి కి తీసుకెళ్లారని..తమనెందుకు పట్టించుకోలేదని వైసీపీ నేతలు మండిపడ్డారు. కమీషనర్ సంగతేంటో తెలుస్తానని శివరామ హెచ్చరించారు. ఈ విషయంలో ప్రభుత్వ విధానాలు..పార్టీ విధానాలు మార్చుకోవాలని విన్నవించారు.
వైసీపీ అదిష్టానం ఇదే విధానాన్ని కొనసాగిస్తే కార్పోరేషన్లు ఎన్నికల్లో సీన్ మరోలా ఉంటుందని అల్టిమేటం జారీ చేసారు. తనకున్న కో ఆర్డినేటర్ పదవి తీసేసినా పర్వాలేదని…రాజమండ్రి ప్రజల పక్షాన మాత్రం బలంగా నిలబడతానని అన్నారు. ఇప్పటికే వైసీపీ పార్టీపై రాష్ర్ట వ్యాప్తంగా పలు జిల్లాల్లో వ్యతిరేకత వ్యక్తమవుతోన్న సంగతి తెలిసిందే. పార్టీలో అంతర్గత కుమ్ములాటలతో సతమతమవుతోన్న పరిస్థితులు. తాజాగా రాజమండ్రి వ్యవహారం కూడా ముదురుతున్నట్లే కనిపిస్తోంది. ప్రభుత్వాధికారులు టీడీపీ నేతలు చెప్పినట్లు చేయడం కూడా విడ్డూరంగానే ఉంది.