2019 లో ఆంధ్రప్రదేశ్ లో జరిగిన ఎన్నికల్లో యువ నాయకుడు.. వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించాడు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత బాధ్యతలు స్వీకరించిన తర్వాత జగన్మోహన్ రెడ్డి ఎన్నో పథకాలు అమలులోకి తెచ్చి ప్రజలకు సేవలు అందిస్తున్నారు. ముఖ్యంగా విద్యార్థులు రైతులకు జగన్మోహన్ రెడ్డి సర్కార్ మునుపెన్నాడు చేయని విధంగా కొత్త పథకాలను అమలులోకి తెచ్చి ప్రజలకు సేవలు అందిస్తున్నారు.
ఈ క్రమంలో పాఠశాలల్లో చదువుకునే విద్యార్థులకు అమ్మ ఒడి పథకం ద్వారా సంవత్సరానికి 15 వేల రూపాయలు ఆర్థిక సహాయం అందజేస్తున్నారు. ఇక దేశానికి వెన్నెముకగా నిలిచిన రైతులకు కూడా జగన్ సర్కార్ ఎన్నో పథకాలను అమలులోకి తెచ్చింది. ఈ క్రమంలో పంట నష్టం ద్వారా అప్పుల పాలైన రైతులకు కూడా నష్టపరిహారాన్ని చెల్లించి ఆర్థికంగా సహాయం చేసింది.అలాగే రైతు భరోసా పేరిట రైతన్న ఖాతాలో డబ్బులను జమ చేస్తూ వారి వ్యవసాయ పనులకు ఎంతో ఆసరాగా నిలుస్తున్నారు.
తాజాగా జగన్ సర్కార్ ఏపీ రైతులకు మరొక శుభవార్త తెలియజేసింది. తాజాగా ఎన్టీఆర్ జిల్లా అవనిగడ్డలో పర్యటించిన సీఎం జగన్మోహన్ రెడ్డి… 22 ఏ (1) కింద ఉన్న నిషేదిత భూముల సమస్యకు పరిష్కారం అందించాడు. అవనిగడ్డలో పర్యటించిన జగన్మోహన్ రెడ్డి అక్కడ ఉన్న నిషేధిత భూముల సమస్యకు పరిష్కారం తెలియజేశాడు. నిషేదిత భూముల జాబితా నుంచి డీనోటిఫై చేసిన భూములకు సంబంధించిన క్లియరెన్స్ పత్రాలను రైతులకు తన చేతుల మీదుగా అందజేశాడు. దీంతో స్థానిక రైతులు వారి భూములు దక్కినందుకు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇలా ప్రతినిత్యం ప్రజల శ్రేయస్సు గురించి ఆలోచించి ప్రజా నాయకుడిగా జగన్ మంచి ప్రజాఆదరణ సొంతం చేసుకుంటున్నాడు.