2019 ఎన్నికల్లో టీడీపీ 23 సీట్లు సాధించడం…పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుకి వృద్ధాప్యం మీద పడటంతో ఇక ఆయన యాక్టివ్ గా కొనసాగలేరని కొన్నాళ్లగా ప్రచారం సాగుతోన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పార్టీ బాధ్యతలు తీసుకుని సమర్ధవతంగా నడిపించాలంటే నటుడు జూనియర్ ఎన్టీఆర్ రంగంలోకి దిగాల్సిందేనని మీడియా కథనాలు వెడెక్కించాయి. అయితే చంద్రబాబు ఉన్నంత కాలం అది జరిగే పని కాదన్నది అంతకు మించి బలమైన వార్త తెరపైకి వచ్చింది. ఈ నేపథ్యంలో సిక్కోలు సిగం, ఎర్రం నాయుడు తనయుడు ఎంపీ రామ్మోహన్ నాయుడు పేరు కూడా తెరపైకి వచ్చింది.
రామ్మోహన్ నాయుడి ట్యాలెంట్ చూసి చంద్రబాబు పార్టీ బాధ్యతలు అప్పగించేస్తున్నారని వైసీపీ నాయకులు పెద్ద ఎత్తున ఆరోపించారు. కానీ సీనియర్లని వదిలేసి..జూనియర్లకి ఎలా ఇస్తారు? అన్న వాదన బలంగా వినిపించింది. ఈ నేపథ్యంలో తాజాగా చంద్రబాబు నాయుడు పార్టీ బాధ్యతల్ని ఎవరూ ఊహించని ఓ సీనియర్ కి కట్టబెట్టబోతున్నట్లు తెరపైకి వచ్చింది. తద్వారా అతనికి క్లీన్ చీట్ కూడా ఇచ్చినట్లు అవుతుందని చంద్రబాబు పావులు కదుపుతున్నట్లు ఉప్పందింది. అతెనోవరో కాదు. ఇటీవలే ఈఎస్ ఐ కుంభకోణంలో అరెస్ట్ అయిన ఎమ్మెల్యే, మాజీ మంత్రి అచ్చెన్నాయుడికి అప్పగించి రిలాక్స్ అవ్వాలనుకుంటున్నారుట.
వాస్తవానికి ఈ తరహా ప్రచారం గతంలోనే సాగింది. కానీ ప్రస్తుతమున్న పరిస్థితుల్లో చంద్రబాబుకు ఆయన తప్ప మరో సీనియర్ నేత ఆప్షన్ గా కనిపించలేదని సమాచారం. ప్రస్తుతం టీడీపీ ఏపీ అధ్యక్షుడిగా ఉన్న కళా వెంకటరావు పనితీరు అంతంత మాత్రంగా ఉండటం, మిగతా సీనియర్లతో పోల్చుకుంటే అన్ని రకాలుగా ఆ పదవికి అచ్చెన్నాయుడు అర్హుడని భావించి చర్యలు ముమ్మరం చేసినట్లు టీడీపీ కార్యాలయాల నుంచి వినిపిస్తోంది. ఈ ప్రక్రియ మొత్తం వీలైనంత త్వరగా పూర్తిచేసి అచ్చెన్న ద్వారానే వైసీపీపై ఎటాక్ కి దిగాలని చంద్రబాబు పావులు కదుపుతున్నట్లు ప్ర్రచారం సాగుతోంది.