శ్రీనివాస్ తో పోలీసులే చెప్పించారా ? తెరవెనక ఉన్నదెవరు ?

అందరిలోను అదే అనుమానం మొదలైంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డిపై మధ్యాహ్నం దాడి జరగ్గానే డిజిపి ఠాకూర్ మీడియతో ఏం చెప్పారో ఏడుగంగల విచారణ తర్వాత నిందుతుడు శ్రీనివాస్ అదే చెప్పారు. అందుకే అందరిలోను అనుమానాలు పెరిగిపోతున్నాయ్. ఏడుగంటల విచారణలో నిందుతుడు ఇవే చెప్పారు అంటూ పోలీసులు చిలకపలుకులు పలకటం ఎందుకు ? ఆ చిలకపలుకులను బయటపెట్టటానికి ఏడు గంటల విచారణ అవసరమా ?

రాష్ట్రంలో పోలీసులు చాలా విచిత్రంగా వ్యవహరిస్తున్నారు. అదికూడా వైసిపి విషయానికి వచ్చేసరికి మరీ ఓవర్ యాక్షన్ చేసేస్తున్నారు. నాలుగున్నరేళ్ళుగా ఈ విషయాలను అందరూ చూస్తున్నదే. తాజాగా జగన్మోహన్ రెడ్డి విషయంలో స్వయంగా పోలీసు బాసు డిజిపి ఆర్ఫి ఠాకూర్ వ్యవహరిచిన తీరు పరాకాష్టగా నిలిచిపోతుంది. విశాఖ ఎయిర్ పోర్టులో ఘటన జరిగన వెంటనే డిజిపి మాట్లాడుతూ దాడి చేసిన శ్రీనివాస్ జగన్ అభిమాని అంటూ తేల్చేశారు. ఎన్నికల్లో జగన్ కు సానుభూతి తెచ్చి పెట్టేందుకే కత్తితో దాడి చేసి గాయపరిచినట్లు పోలీసులు చెప్పేశారు.

పోలీసులు చెప్పేదే కాసేపు నిజమనుకుందాం. తనపై తానే దాడి చేయించుకుంటే సానుభూతి వస్తుందన్న జగన్ ప్లాన్ బయటపడదా ? జగన్ ఏమీ అధికారంలో ఉంటూ ఎన్నికలను ఎదుర్కోవటం లేదే. ఘటన జరిగిన వెంటనే అధికారంలో ఉన్న తెలుగుదేశం ప్రభుత్వం నిందితుడుని పట్టుకుని నిజం కక్కించదని తెలుసుకోలేనంత అమాయకుడా జగన్. తన ప్లాన్  బెడిసికొడితే ఏమవుతుందో ఆలోచించలేనంత వెర్రిబాగులోడా జగన్ ?

అదే సమయంలో ప్రచారం కోసమే జగన్ పై శ్రీనివాస్ దాడి జరిపారంటూ డిజిపినే తేల్చేశారు. పైగా నిందుతుని కులం ఏంటో కూడా డిజిపి చెప్పటం విచిత్రంగా ఉంది. జరిగిన దాడి గురించి వివరించకుండా దాడి చేసిన వాడి కులం గురించి చెప్పాల్సిన అవసరం ఏంటి ? ప్రచారం కావాలనుకున్నవారు ఏ సెల్ఫీనో లేకపోతే ఆటోగ్రాఫో తీసుకుంటారు కానీ ఏకంగా కత్తితోనే గాయపరుస్తారా ?

మధ్యాహ్నం పోలీసు బాసు మాట్లాడిన తర్వాత మంత్రులు ఒకరి తర్వాత మరొకరు వరుసపెట్టి అవే మాటలను వల్లేవేశారు. ఏడుగంటల విచారణ తర్వాత శ్రీనివాస్ కూడా అదే మాటలు చెప్పారంటూ పోలీసులు ఓ స్టేట్మెంట్ ఇచ్చారు. చివరగా రాత్రి చంద్రబాబునాయుడు కూడా అదే మాటలను మీడియాతో చెప్పటం చూస్తుంటే స్క్రిప్ట్ లో తెరముందు పోలీసుల పాత్రే ఎక్కువగా ఉన్నట్లు అనుమానాలు పెరిగిపోతున్నాయి.