చూడబోతే అలాగే ఉంది చంద్రబాబునాయుడు వ్యవహారం. పదే పదే ఈవిఎంలుని వివి ప్యాట్లని ఒకటే దేశవ్యాప్తంగా చంద్రబాబు చేస్తున్న గోల చూస్తుంటే అందరిలోను అనుమానాలు పెరిగిపోతున్నాయి. చంద్రబాబు వాదనను కోర్టులు కొట్టేస్తున్న మళ్ళీ మళ్ళీ ఎవరెవరితోనో కోర్టుల్లో కేసులు వేయిస్తున్నట్లున్నారు.
ఓట్ల లెక్కింపు సందర్భంగా ముందు వివి ప్యాట్లలోని స్పిప్పులను లెక్కించాలని ఒకసారి అంటారు. లేదు లేదు 50 శాతం వివి ప్యాట్లలోని స్లిప్పులు లెక్కించాల్సిందేనంటూ పట్టుపడతారు. పోలింగ్ జరిగిన దగ్గర నుండి ఈవిఎంలను ట్యాంపర్ చేయొచ్చని అన్న విషయాలు తెలిసిందే. ఇపుడేమో కనీసం 50 శాతం వివి ప్యాట్లలోని స్లిప్పులను బ్యాలెట్ బాక్సులో వేయించాలంటున్నారు.
ఇలా ఏదో ఒక గోల చేస్తునే ఉన్నారు. తాను గోల చేయటమే కాకుండా మిత్రపక్షాల నేతలను కూడా కలిసి హడావుడి చేస్తున్నారు. పదే పదే ఢిల్లీలో సమావేశాలు పెట్టిస్తు ఈవిఎంలు, వివి ప్యాట్లపై తీర్మానాలు చేయిస్తు, రాష్ట్రపతికి లేఖలు రాయిస్తున్నారు. ఇదంతా ఎందుకు చేయిస్తున్నారు చంద్రబాబు అంటే ఓటమి భయమే అంటున్నారు.
రేపటి కౌంటింగ్ లో ఓడిపోతే జనాలంతా తమకే ఓట్లేసినా ఈవిఎంలను మ్యానేజ్ చేసుకుని తమను ఓడించారని గోల చేయటానికి వేదిక సిద్ధం చేసుకున్నట్లే అనిపిస్తోంది. సంక్షేమ పథకాలు అమలు చేయటం, పసుపు-కుంకుమ లాంటి కార్యక్రమాలు అమలు చేశానని చెప్పుకుంటున్న చంద్రబాబు ఓడిపోతే ఇంకమన్నా ఉందా ?