ముస్లిం, గిరిజనులను చంద్రబాబు అవమానించారా ?

అవును, ఆ రెండు సామాజికవర్గాలను చంద్రబాబునాయుడు దారుణంగా అవమానించారనే అంటున్నారు. ఒకవైపు ఎన్నికలు ముంచుకు వస్తున్న సమయంలో హఠాత్తుగా చంద్రబాబుకు ముస్లిం మైనారిటీలు, గిరిజనులు గుర్తుకు రావటం విచిత్రంగానే ఉంది. ఆదివారం నాడు హడావుడిగా మంత్రివర్గ విస్తరణ చేయటానికి నిర్ణయించుకున్నారంటే పై రెండు సామాజికవర్గాలను అవమానించటం కాక మరేమిటి ? నిజంగానే చంద్రబాబుకు వారిపై అంత ప్రేమే ఉండుంటే నాలుగున్నరేళ్ళు వారిని మంత్రివర్గంలోకి ఎందుకు తీసుకోలేదు ?

మరో ఆరునెలల్లో చంద్రబాబు ప్రభుత్వానికి కాలపరిమితి ముగుస్తోంది. చివరి ఆరుమాసాల్లో ఎన్నికలను నిర్వహించేందుకు ఎన్నికల కమీషన్ కు పూర్తి అధికారాలున్నాయన్న విషయం అందరికీ తెలిసిందే. తన అధికారాలను గనుక ఎన్నికల కమీషన్ ఉపయోగించుకోవాలని అనుకుంటే అప్పుడు వీళ్ళ పరిస్ధితేంటి ?  ఇఫుడు మంత్రులుగా బాధ్యతలు తీసుకోబోతున్న ఇద్దరు మంత్రిపదవుల్లో ఎంతకాలం ఉంటారో ఎవరికీ తెలీదు. పైగా డిసెంబర్ తర్వాత ఎన్నికల కోడ్ గనుక అమల్లోకి వస్తే వాళ్ళు మంత్రులుగా ప్రోటోకాల్ అనుభవించటం తప్ప చేయటానికి ఏమీ ఉండదు. ఈ విషయాలన్నీ 40 ఇయర్స్ ఇండస్ట్రీకి తెలియదా ?

పోయిన ఎన్నికల్లో తెలుగుదేశంపార్టీ తరపున పోటీ చేసిన ముస్లిం మైనారిటీలు, గిరిజనుల్లో ఒక్కళ్ళు కూడా గెలవలేదు. అందుకనే వైసిపి తరపున గెలిచిన 23 మంది ఎంఎల్ఏలను ప్రలోభాలకు గురిచేసి టిడిపిలోకి లాక్కున్నారు. అందులో ముస్లిం, గిరిజన ఎంఎల్ఏలు కూడా ఉన్నారు. టిడిపిలోకి లాక్కునేటప్పుడు వారికి మంత్రిపదవులను ఎరగా వేశారు. జలీల్ ఖాన్, అత్తార్ చాంద్ భాష, కిడారి సర్వేశ్వరరావు, గిడ్డి ఈశ్వరి, వంతల రాజేశ్వరి టిడిపిలోకి అలా వచ్చినవారే.

జగన్ ను దెబ్బ కొట్టటమే లక్ష్యంగా చంద్రబాబు ఫిరాయింపులను ప్రోత్సహించారు కానీ వారిపై నిజంగా ప్రేమతో కాదన్న విషయం అర్ధమైపోయింది. ఫిరాయింపుల్లో నలుగురికి మంత్రిపదవులు కట్టబెట్టిన చంద్రబాబు ముస్లింలు, గిరిజనులకు మాత్రం మొండి చెయ్యి చూపారంటే అర్ధమేంటి ? ముస్లిం ఓట్ల కోసం చంద్రబాబు గుంటూరులో సభ పెట్టారు గుర్తుందా ?  పోయిన ఎన్నికల్లో తమకిచ్చిన వాగ్దానాలను నెరవేర్చలేదని నినాదాలు చేసినందుకు తొమ్మిదిమంది ముస్లిం యువకులపై దేశద్రోహం కేసులు పెట్టి చావగొట్టించిన ఘనడు సిఎం.

అలాగే, టిడిపి తరపున గిరిజన ఎంఎల్ఏలు గెలవలేదన్న ఉద్దేశ్యంతో అసలు గిరిజన సలహా మండలి నియామకాన్నే నిలిపేసిన గొప్పోడు చంద్రబాబు.  అటువంటి చంద్రబాబు ఇపుడు హఠాత్తుగా ముస్లిం, గిరిజనులను మంత్రివర్గంలోకి ఎందుకు తీసుకుంటున్నారు ? ఎందుకంటే, కేవలం వచ్చే ఎన్నికల్లో పై సామాజికవర్గాల ఓట్లను కొల్లగొట్టేందుకే అని అర్ధమైపోతోంది. చివరి ఆరుమాసాల్లో ముస్లిం, గిరిజనులకు మంత్రి పదవులు ఇచ్చినంత మాత్రానా ఓట్లు గుద్దేస్తారా ?