చంద్రబాబునాయుడు మాటలు చూస్తుంటే అందరికీ అలాగే అనిపిస్తోంది. మొన్నటి ఎన్నికల్లో ఎదురైన ఘోర పరాజయం చంద్రబాబు మానసిక పరిస్ధితిపై బాగా ప్రభావం చూపుతున్నట్లే ఉంది. టిడిపి చరిత్రలోనే ఎన్నడూ తిననంత గట్టి దెబ్బతిన్నది మొన్నటి ఎన్నికల్లోనే. అందులోను 46 ఏళ్ళ వయస్సున్న జగన్మోహన్ రెడ్డి చేతిలో దెబ్బ తినటంతో 40 ఇయర్స్ ఇండస్ట్రీ తట్టుకోలేకున్నారు.
ఘోర ఓటమి చంద్రబాబు మానసికపరిస్ధితిపై ఏ స్ధాయిలో తగిలిందంటే ఎవరు కలిసినా, ఎక్కడికి వెళ్ళినా ఎందుకు ఓడిపోయామో తెలీటం లేదనే మాట్లాడుతున్నారు. ఫలితాలు వచ్చిన దగ్గర నుండి చంద్రబాబును చాలామంది నేతలే కలుసుంటారు. వాళ్ళతో మాట్లాడుతూ మనం ఎందుకు ఓడిపోయామని వాళ్ళనే అడిగారు. ఎందుకు ఓడిపోయామో కారణాలు తెలీటం లేదని వాళ్ళతో చెప్పారు.
విషయం ఏమిటంటే ఐదేళ్ళ చంద్రబాబు అత్యంత అవినీతి పాలనను, అరాచక పాలనను జనాలు భరించలేకపోయారన్నది వాస్తవం. ఈ విషయం టిడిపితో పాటు ప్రతీ ఒక్కరికీ తెలుసు. అందరికీ తెలిసిన ఈ విషయం చంద్రబాబుకు మాత్రం ఎందుకు తెలీదు ? తన పాలన ఎంత అధ్వాన్నంగా జరిగిందో తెలిసి కూడా చంద్రబాబు నాటకాలాడుతున్నారు.
అంతా బాగుంది…అంతా బాగుంది అని చంద్రబాబు తనను తాను మోసం చేసుకుంటున్నారు. ఓటమిపై జరిపిన సమీక్షల్లో చంద్రబాబులోని లోపాలను పార్టీ నేతలు కొందరు వివరించారు. అయినా వాటిని అంగీకరించే పరిస్ధితిలో చంద్రబాబు లేరు. అంటే అర్ధమవుతున్నదేమిటంటే చంద్రబాబులో మానసిక పరివర్తన రానంత వరకూ ఇటువంటి నాటకాలు కొనసాగుతునే ఉంటాయి టిడిపిలో.