విచిత్రంగా ఉంది తెలుగుదేశంపార్టీ నేతల మాటలు. కరకట్టపై తాను నివాసం ఉంటున్న అక్రమనిర్మాణం లింగమనేని గెస్ట్ హౌస్ ను కూల్చేయటానికి ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే. అప్పటి నుండి టిడిపి నేతలు పరిసర గ్రామాల ప్రజలను తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని శాపనార్ధాలు పెట్టిస్తున్నారు. రైతులు కమ్ టిడిపి నేతలు చంద్రబాబును కలిసినపుడు మాట్లాడుతున్న మాటలే విచిత్రంగా ఉంటున్నాయి.
టిడిపి నేతల మాటల ప్రకారం అమరావతికి చంద్రబాబే బ్రాండ్ అంబాసిడరట. కాబట్టి చంద్రబాబు ఇక్కడి నుండి వెళ్ళిపోతే బ్రాండ్ విలువ పడిపోతుందట. అసలు అమరావతికి ఇపుడున్న బ్రాండ్ ఇమేజేమిటో ఎవరికీ అర్ధం కావటం లేదు. అసలు అమరావతి అన్నదే లేదు ఇంత వరకూ. లేని అమరావతికి బ్రాండ్ ఇమేజేమిటో చెప్పించే వాళ్ళకే తెలియాలి.
అలాగే రాజధాని ఇమేజి కూడా పడిపోతుందట. ఇపుడక్కడ ఉన్నదంతా తాత్కాలిక సచివాలయం, తాత్కాలిక అసెంబ్లీ భవనం మాత్రమే. ప్రజావేదికను కూడా అక్రమమన్న ముద్రవేసి కూల్చేసింది ప్రభుత్వం. ఇక నాసిరకంగా కట్టిన సచివాలయం, అసెంబ్లీల సంగతి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. వేల కోట్ల ప్రజాధనాన్ని వృధా చేసిన కట్టినందుకు చంద్రబాబు ఇమేజి ఎప్పుడో నాశనమైపోయింది.
లేని ఇమేజిని ఉందని ఊహించుకోవటం, లేని బ్రాండ్ వాల్యుని పడిపోతుందని చెప్పించుకోవటం టిడిపి నేతలకే చెల్లింది. మొన్నటి ఎన్నికల్లో జనాలు చావు దెబ్బకొట్టినా టిడిపి నేతలకు ఇంకా బుద్ధ రాలేదంటే ఇక రాదనే అర్ధమైపోతోంది. కాబట్టి తనంతట తానుగా అక్రమనిర్మాణం నుండి ఖాళీ చేసి వెళిపోతే చంద్రబాబుకు మంచిది