జగన్మోహన్ రెడ్డిపై హత్యాయత్నికి ప్రయత్నించిన నిందితుడు శ్రీనివాస్ కు ప్రాణహాని ఉందా ? నిందితుడి సోదరి చెబుతున్న దాని ప్రకారం అవుననే అనిపిస్తోంది. నిందితుడు సోదరు రత్నకుమారి మీడియాతో మాట్లాడుతూ హత్యాయత్నం కుట్ర బయటపడకుండా ఉండేందుకు తన సోదరుడు శ్రీనివాస్ ను చంపేస్తారేమో అన్న అనుమానాన్ని వ్యక్తం చేశారు. హత్యాయత్నానికి ప్రయత్నించింది తన తమ్ముడే అయినప్పటికీ చేయించిన వాళ్ళ పేర్లు బయటపెడితే ఎక్కడ చంపేస్తారో అన్న భయంతోనే తమ తమ్ముడు పేర్లు చెప్పటం లేదేమో అన్న అనుమానాన్ని వ్యక్తం చేస్తుండటం చూస్తుంటే ఆమె చెప్పిందాంట్లో నిజముందనే అనిపిస్తోంది.
శ్రీనివాస్ చెబుతున్న మాటలు, జరుగుతున్న సిట్ దర్యాప్తు తీరు చూస్తుంటే కూడా విచారణలో కుట్ర కోణాన్ని బహిర్గతం చేసే ఉద్దేశ్యం ఉన్నతాధికారులకు లేదేమో అన్న అనుమానాలు కలుగుతున్నాయి. ఎందుకంటే, వారం రోజుల పాటు తమ కస్టడీలో ఉంచుకున్న సిట్ అధికారులు కూడా తమ విచారణలో నిందితుడు నోరిప్పటం లేదని, సహకరిచటం లేదని చెప్పటం చూస్తే అందరిలోను అనుమాలు బలపడుతున్నాయి. బండలో పెట్రోలు పోసుకునేందుకు కూడా తాను తమ్ముడికి రూ 20 ఇచ్చేదాన్ని అని చెబుతున్న సోదరి మాటలు విన్న వారికి నాలుగు ఎకరాల భూమిని కొనేందుకు డబ్బు ఎక్కడినుండి వచ్చిందనేది ప్రశ్నకు సమాధానం లేదు.
పైగా నిందితుడు గత పది నెలల్లో తొమ్మిది మొబైల్ ఫోన్లు మార్చాడని స్వయంగా సిట్ విచారణాధికారి మహేష్ చంద్ర లడ్డానే చెప్పారు. ఆ విషయమై రత్నకుమారి మాట్లాడుతూ, చిన్న బేసిక్ ఫోన్ తప్ప కొనలేని తన తమ్ముడు తొమ్మిది ఫోన్లు మార్చాడంటే నమ్మలేకున్నట్లు చెప్పటం గమనార్హం. తన తమ్ముడికి డబ్బును ఆశగా చూపి లోబరుచుకున్నట్లు ఆరోపిస్తున్నారు. చేతిలో రూపాయి కూడా లేని తన తమ్ముడు ఏకంగా జగన్మోహన్ రెడ్డిపై తనంతట తానుగా హత్యాయత్నానికి దిగాడంటే నమ్మలేనంటు కుండబద్దలు కొట్టినట్లు జగన్ మీడియాతో చెప్పారు. నోరిప్పితే హత్యాయత్నం బాధ్యతను అప్పగించిన వారు తననెక్కడ చంపేస్తారో అన్న భయంతోనే తన తమ్ముడు నోరిప్పటం లేదని రత్నకుమారి స్పష్టంగా ఆరోపిస్తున్నారు.