కోడెల ఒంటరైపోయారా ?

పార్టీతో దాదాపు ముప్పై సంవత్సరాల అనుబంధం పలచబడిపోతోంది. పార్టీలో ఒంటరైపోయారు. ఇదంతా ఎవరి గురించో అర్ధమైపోయుంటుంది. అవును టిడిపి సీనియర్ నేత, మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్ గురించే. అధికారంలో ఉండగా కోడల కానీ ఆయన కుటుంబం గానీ చేసిన ఆగడాలు, అరాచకాల వల్లే ఆయనకు ఇపుడు ఈ పరిస్ధితి దాపురించిందనటంలో ఎటువంటి సందేహం లేదు.

స్పీకర్ పదవిని అడ్డం పెట్టుకుని అసెంబ్లీలోను బయటా అరాచకాలకు తెగబడ్డారు కుటుంబం మొత్తం. పార్టీ వాళ్ళు, బయట వాళ్ళు అన్న తేడా లేకుండా ప్రతీ ఒక్కరిని రకరకాలుగా వేధించారు. దాని ఫలితమే ఎన్నికల్లో ఓటమి తర్వాత ఒక్కసారిగా బయటపడుతోంది. చంద్రబాబునాయుడు, కోడెల సమక్షంలోనే ఆయన వ్యతిరేక బ్యాచ్ పెద్ద ఎత్తున పార్టీ కార్యాలయంలో బుధవారం నిరసన తెలపటంతో అందరూ ఆశ్చర్యపోయారు.

ఇంకా విచిత్రమేమిటంటే కోడెలకు వ్యతిరేకంగా అంతమంది నిరసన చంద్రబాబు కనీసం వద్దని వారించే ప్రయత్నం కూడా చేయలేదు. సత్తెనపల్లి నుండి క్విట్ కోడెల అటూ పెద్ద బ్యానర్లు పట్టుకుని వ్యతిరేక నినాదాలు చేస్తుంటే వాటిని చంద్రబాబు బాగా ఎంజాయ్ చేసినట్లే కనబడింది. అంటే కోడెలపై చంబాబులో కూడా అంతగా కసి పెరిగిపోయిందా అన్న అనుమానం మొదలైంది పార్టీ నేతల్లో.

మొన్నటి అసెంబ్లీ సమావేశాల్లో  ఫిరాయింపులపై జరిగిన చర్చల్లో వైసిపి  సభ్యులు కోడెలపై ఆరోపణలు చేసినపుడు టిడిపి సభ్యుల్లో ఎవరూ కనీసం ప్రతిఘటించే ప్రయత్నం కూడా చేయలేదు. ఫిరాయింపులను ప్రోత్సహించటంలో చంద్రబాబు చెప్పినట్లా విన్న కోడెల దాని ఫలితాన్ని ఇపుడు అనుభవిస్తున్నారు. సో జరుగుతున్నది చూస్తుంటే పార్టీతో ఉన్న  దశాబ్దాల అనుబంధం కోడెలకు తెగిపోతుందా అన్న అనుమానాలు మొదలయ్యాయి. ఎందుకంటే పార్టీలో ఇపుడు కోడెల ఒంటరివారపైయారు కాబట్టే.