బుకాయించి అడ్డంగా బుక్కవుతున్న సిఎం..రూ 800 కోట్లా ?

ఓ టివి చర్చా కార్యక్రమంలో మీసం మెలేసిన తెలుగుదేశంపార్టీ రాజ్యసభ సభ్యుడు సిఎం రమేష్ అడ్డంగా బుక్కైపోతున్నారా ? క్షేత్రస్ధాయిలో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే అందరిలోనూ అదే అనుమానాలు వస్తున్నాయ్. ఐటి సోదాల్లో రూ 100 కోట్ల దారిమళ్ళింపు కాస్త రూ 800 కోట్లకు పాకుతోంది. 100 కోట్ల రూపాయలు దారిమళ్ళాయని ఐటి అధికారులు నిర్ధారించగా తాజాగా మరో 700 కోట్ల రూపాయల అనుమానాస్పద లావాదేవీలు బయటపడ్డాయని సమాచారం. దాంతో త్వరలో సిఎం రమేష్ ను ఐటి అధికారులు విచారణ నిమ్మితం అదుపులోకి తీసుకుంటారనే ప్రచారం ఊపందుకుంది.

ఎందుకంటే రిత్విక్ ప్రాజెక్ట్స్ లో అకౌంటెంట్ సాయిబాబా నిధుల దారిమళ్ళింపుకు లెక్కలు చెప్పలేకపోయారట. కాబట్టే సాయిబాబాపై త్వరలో న్యాయపరమైన చర్యలకు ఐటి అధికారులు రంగం సిద్దం చేస్తున్నారు. సాయిబాబాను అదుపులోకి తీసుకుంటే తర్వాత వంతు సిఎం రమేష్ దే అవుతందనటంలో సందేహం లేదు. సిఎంను గనుక విచారణ కోసం అదుపులోకి తీసుకుంటే ఇప్పటి వరకు తెరవెనుక ఉన్న వ్యవహారాలు, కీలక వ్యక్తులంతా బయటపడక తప్పదు.

డొల్ల కంపెనీలను ఏర్పాటు చేయటం ద్వారా 100 కోట్ల రూపాయలను దారిమళ్ళించారనేందుకు ఐటి అధికారులకు పక్కా ఆధారాలు లభించాయి. అదే సమయంలో మరో 700 కోట్ల రూపాయల అనుమానాస్పద లావాదేవీలను కూడా ఐటి గుర్తించిందట. దానికి కూడా సాయిబాబా సమాధానం చెప్పలేకపోయారు. విచిత్రమేమిటంటే, మూడు రోజుల క్రితం ఓ చర్చా కార్యక్రమంలో ఐటి దాడులపై మీసం మెలేసిన సిఎం రమేష్ ఇపుడు ఎక్కడా కనబడటం లేదు. పైగా రూ 100 కోట్ల దారిమళ్ళింపు వ్యవహారాన్ని మీడియా ప్రశ్నిస్తే ఆ విషయం ఐటి అధికారులనే అడగాలంటూ తప్పించుకోవటం గమనార్హం.

రిత్విక్ ప్రాజెక్ట్స్, రిత్విక్ ప్రాపర్టీస్ లాంటి సంస్ధల ఖాతాల్లోకి  ఎక్కడి నుండో వందల కోట్ల రూపాయలు రావటం, వెంటనే ఆ డబ్బును కంపెనీలు క్యాష్ రూపంలోనే విత్ డ్రా చేయటంతోనే ఐటి అధికారుల అనుమానాలు బలపడ్డాయి. విత్ డ్రా చేసిన డబ్బు ఎక్కడి నుండి వచ్చింది ? ఎక్కడికి వెళ్ళింది ? అనే లెక్కలను సాయిబాబా సమాధానం చెప్పలేకపోయారు. ఆ డబ్బు మొత్తం టిడిపిలోని ఓ కీలక యువనేతకు చెందిన ఇంధన తయారీ కంపెనీలోకి చేరిందన్నది అనుమానం.  జరుగుతున్న వ్యవహారాలు చూస్తుంటే సిఎం రమేష్ అడ్డంగా బుక్కయ్యేట్లే కనబడుతోంది. మరి ఇపుడు కూడా సిఎం రమేష్ మీసం మెలేయగలరా ?