చంద్రబాబు గురించి విజయసాయి చెప్పింది నిజమేనా ?

చంద్రబాబు మానసిక పరిస్ధితిపై వైసిపి రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి బాగానే అధ్యయనం చేసినట్లున్నారు. అధ్యయనం చేసినట్లుంది. ఇంతకాలం చంద్రబాబు అల్జిమర్స్ అనే జబ్బుతో బాధపడుతున్నారని, అల్జిమర్స్ చివరి దశకు వచ్చేసిందని కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు కెవిపి రామచంద్రరావు చెబుతున్న విషయం తెలిసిందే.

 

అయితే, కొత్తగా విజయసాయి చెబుతున్నదాని ప్రకారమైతే చంద్రబాబు పాథలాజికల్ లయ్యింగ్ అనే మానసిక రుగ్మతతో ఇబ్బంది పడుతున్నట్లు చెప్పారు. విజయసాయి తాజాగా చెప్పినదాని ప్రకారం కెవిపి చెప్పినట్లు అల్జిమర్స్ కూడా ఉందా లేకపోతే పాథలాజికల్ లయ్యింగ్ అనే రుగ్మత మాత్రమే ఉందా అన్నది తేలలేదు. లేకపోతే రెండూ ఉన్నాయా అన్న అనుమానం కూడా కలుగుతోంది.

 

విజయసాయిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబులో పాథలాజికల్ లయ్యర్ అనే జన్యుపరమైన సమస్య తీవ్రస్ధాయికి చేరుకుందని చెబుతున్నారు. చంద్రబాబు నోరు తెరిస్తే అబద్ధాలు చెప్పటం, అబద్దాల వర్షం ఎందుకు కురిపిస్తారో సైకాలజిస్టులు గుర్తించినట్లు రాజ్యసభ సభ్యుడు చెబుతున్నారు. ఈ రోగానికి నివారణ కూడా ఉందని సైకాలజిస్టులు చెప్పారట లేండి. జన్యువుల్లో తలెత్తే అసహజ రుగ్మతల వల్ల  ఎప్పటికప్పుడు కట్టుకథలు అల్లటం, అసత్యాలు చెప్పటం, అబద్దాలను చెబుతే వాటినే నిజాలుగా నమ్మించే ప్రయత్నాలు చేస్తుంటారట ఈ వ్యాధిగ్రస్ధులు.  

 

అటువంటి మానసిక సమస్య చంద్రబాబులో కూడా ఉందని సైకాలజిస్టులు గుర్తించినట్లు విజయసాయి చెప్పారు. లక్షల్లో ఒకరికి ఇటువంటి రుగ్మత వస్తుందని  సైకాలజిస్టులే చెప్పారట. అయితే, దానికి  సరైన చికిత్స తీసుకుంటే మానసిక రుగ్మత నుండి బయటపడినవాళ్ళు కూడా ఉన్నట్లు సైకాలజిస్టులు చెప్పారట. అయితే, అబద్ధాలకు రంగులద్ది జనాలను నమ్మించేలా చేయటం సులభమని గ్రహించిన చంద్రబాబు ఈ రుగ్మతను ఒక జీవన విధానంగా, జీవన సరళిగా మార్చుకున్నారట. ఈ రుగ్మతనే పాథలాజికల్ లయ్యింగ్ లేదా కంపల్సివ్ లయ్యింగ్ అని హ్యాబిట్చువల్ లయ్యింగ్ అని కూడా పిలుస్తారట.

 

ఈ రుగ్మతను అనుకూలంగా మార్చుకున్న వ్యక్తులు ఇక ఎప్పటికీ నిజాలు చెప్పరట. తమను తాము ఉన్నత వ్యక్తిత్వం కలవారిగాను, సమాజంలో మార్పు కోసం ప్రయత్నిస్తున్న వారిగా చెప్పుకుంటుటారట. కుటుంబసభ్యులకు, సన్నిహితులకు, చివరకు తమతో పని చేసే వారికి కూడా ఎప్పటికీ నిజాలు చెప్పరట. చంద్రబాబు ఈ మధ్య చేసిన ప్రకటనలను కూడా విజయసాయి కూడా ప్రస్తావించారు.

 

హుద్ హుద్ ను  జయించానని చెప్పటం, తిత్లీ తుపాను ప్రభావాన్ని తగ్గించేశామని చెప్పటం, సముద్రాన్ని కంట్రోల్ చేసేశానని ప్రకటించటం, అమరావతిలో ఒలంపిక్స్ నిర్వహించాలని చెప్పటం లాంటి చంద్రబాబు ప్రకటనలను ఉదహరించారు. అంటే విజయసాయి చెప్పారని కాదుకానీ పై ప్రకటనలన్నీ వివిధ సందర్భాల్లో చంద్రబాబు చెప్పినవే.