ఆ కానిస్టేబుల్ ప్రశ్నలకు జగన్ సర్కార్ దగ్గర సమాధానం ఉందా?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలో ఉన్న జగన్ సర్కార్ దూకుడుగా ముందుకు వెళ్లడం ఆ పార్టీకి ఒక విధంగా ప్లస్ అవుతుంటే మరో విధంగా మైనస్ అవుతోంది. ఏఆర్ కానిస్టేబుల్ ప్ర‌కాశ్‌ జూన్ నెల 14వ తేదీన గ్రాంట్ ఎస్ఎల్ఎస్‌, ఏఎస్ఎల్ఎస్ ఎరియ‌ర్స్‌ ను ఏపీ ప్రభుత్వం ఇవ్వలేదంటూ ప్లకార్డు పట్టుకుని నిరసన ప్రదర్శించారు. అయితే కానిస్టేబుల్ ఇలా చేయడంతో ప్రభుత్వం వెంటనే బకాయిలను పోలీసుల ఖాతాలలో జమ చేసింది.

అయితే ఆ తర్వాత ప్రభుత్వం ప్రకాశ్ ను సస్పెండ్ చేయడంతో పాటు అతనిపై గతంలో నమోదైన పాత ఫిర్యాదు ఆధారంగా డిస్మిస్ చేసింది. అయితే ప్రభుత్వం కావాలనే ఆయనను డిస్మిస్ చేసిందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. ప్రకాశ్ ను ఉద్యోగం నుంచి శాశ్వతంగా తప్పిస్తున్నట్టు ఉత్తర్వులు రావడం కానిస్టేబుల్ కు టీడీపీ సపోర్ట్ ఉండటం ప్రస్తుతం చర్చనీయాంశమైంది. అదే సమయంలో కానిస్టేబుల్ అడిగిన కొన్ని ప్రశ్నలకు జగన్ సర్కార్ దగ్గర సమాధానం ఉందా అనే కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

సాధారణంగా ఇలాంటి కేసులలో కోర్టు శిక్ష విధిస్తే డిస్మిస్ చేయడం జరుగుతుందని అయితే ప్రకాశ్ ను మాత్రం కావాలనే డిస్మిస్ చేశారని అర్థమవుతోందని నెటిజన్ల నుంచి కామెంట్లు వినిపిస్తున్నాయి. ప్రకాశ్ దళిత వర్గానికి చెందిన కానిస్టేబుల్ కావడం కూడా ప్రస్తుతం చర్చనీయాంశమవుతోంది. పోలీసులకు రావాల్సిన బకాయిల గురించి ప్రశ్నిస్తే డిస్మిస్ చేస్తారా అని కామెంట్లు వినిపిస్తున్నాయి.

తనను డిస్మిస్ చేయడంపై ప్రకాశ్ న్యాయపరంగా సమస్యను పరిష్కరించుకోవాలని భావిస్తున్నారు. ప్రకాష్ న్యాయపరంగా ముందుకు వెళితే ఆయనకు అనుకూలంగా తీర్పు రావడానికి ఎక్కువగా అవకాశాలు అయితే ఉన్నాయి. ప్రకాశ్ వ్యవహారం ఏపీ రాజకీయాలలో కలకలం రేపుతుండగా జగన్ సర్కార్ మరీ కఠినంగా వ్యవహరించిందని కొంతమంది కామెంట్లు చేస్తుండటం గమనార్హం.