ఆర్టికల్ 370 రద్దు మరో పూల్వమాకు దారి తీస్తుందా ?
భారత దేశ అంతర్గత విషయాల్లో పాకిస్తాన్ జ్యోక్యం మరోసారి రుజువైంది . ముఖ్యంగా కాశ్మీర్ పై తమకు అధికారం ఉందని , కాశ్మీర్ కు ప్రత్యేక అధికారాలు కలిపిస్తూ వస్తున్న ఆర్టికల్ 370 ని రద్దు చేశారని తెలియగానే ఈరోజు పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఉభ సభలను వుద్దేచించి అనుచితమైన వ్యాఖ్యలు చేశారు . ముస్లింల విషయంలో భారత్ చేపడున్న చర్యలు జాత్యహంకారాన్ని తెలియజేస్తున్నాయని విమర్శించారు . కాశ్మీర్ లో ఇంతకాలం వున్న ఆర్టికల్ 370 ను తొలగించాలని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వెనుక ఆర్ఎస్ఎస్ ఉందని , ప్రభుత్వం చర్య తో భారత దేశాన్ని హిందూ దేశంగా మార్చుతున్నారని పేర్కొన్నాడు
భారతదేశాన్ని ముస్లిం రాజులు ఐదారు వందల సంవత్సరాలు పరిపాలించారని , ఆ అక్కసు ఇప్పటి పాలకులల్లో కనిపిస్తున్ది ఆగ్రహం వ్యక్తం చేశారు . బ్రిటిషర్లు భారతదేశం వదలి వెళ్లిన తరువాత భారత దేశంలో ముస్లింలను రెండవ తరగతి పౌరులుగా చూడటం మొదలు పెట్టారని విమర్శించారు .
ఒకప్పుడు హిందూ-ముస్లిం ల తరుపున మధ్య వర్తి గా ఉన్న ముహమ్మద్ అలీ జిన్నా, అప్పట్లో ఆర్ఎస్ఎస్ ఎంత ప్రమాదకమైనదో స్వయంగా చూశారని , ముస్లింలు భారతదేశంలోనే ఉంటే వారిని ఎలా ట్రీట్ చేశావారో ఊహించి పాకిస్తాన్ కావాలని పట్టుపట్టి సాధించాడని ఇమ్రాన్ ఖాన్ పేర్కొన్నారు.
ఆ రోజు జిన్నా ముందు చూపు ఎంత మేలు చేసిందో ఇప్పుడు అర్ధమవుతుందని పేర్కొన్నాడు హిందువుల కోసం జాత్యహంకారంతో భారతదేశం ఏర్పాటయ్యిందని , అయితే పాకిస్తాన్ దేశంలో అందరినీ సమానంగా చూస్తామని పేర్కొన్నారు . భారత దేశ చర్య మరో పుల్వామా కు దారి తీసే అవకాశం ఉందని ఇమ్రాన్ హెచ్చరికలు జారీ చేశాడు .
ఆర్టికల్ 370 రద్దు పాకిస్తాన్లో ఎలాంటి ప్రకంపనలు కలిగిస్తున్నాయో ఇమ్రాన్ మాటల వాళ్ళ తెలుస్తుంది . అయితే తాటాకు చప్పుళ్లకు గజరాజులు భయ పడతాయా ?