Jamili Elections: జమిలీ ఎన్నికలపై వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. వన్ నేషన్ వన్ ఎలక్షన్ అనే విధంగా కేంద్రం చర్యలు తీసుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే జమిలి ఎన్నికలు కనుక వస్తే 2027 లోనే ఎన్నికలు వస్తాయని పెద్ద ఎత్తున చర్చలు జరుగుతున్నాయి. అయితే ఈ ఎన్నికలపై వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డి స్పందించారు.
ఈ సందర్భంగా ఆయన విజయవాడ వైసీపీ కార్యాలయ ఏర్పాటు కార్యక్రమంలో మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.గత ఎన్నికల్లో ఏ పార్టీ కార్యాలయంగా వేదికగా విజయం సాదించామో మళ్లీ అదే పార్టీ కార్యాలయం ప్రారంభోత్సవం చేయడం చాలా ఆనందంగా ఉందని వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి పేర్కొన్నారు. ఓడిపోయామనే ఆందోళన అవసరం లేదని ఈయన పేర్కొన్నారు.
ఎన్నికలలో పోటీ చేసిన వారందరూ కూడా ప్రతి ఒక్కరిని కలుపుకోలుగా ముందుకు వెళ్లాలని కార్యకర్తలకు వైయస్ జగన్మోహన్ రెడ్డి అండగా నిలుస్తారని ఈయన తెలిపారు.వారికి ఎలాంటి నష్టం జరగకుండా చూసుకుంటారని అన్నారు. నిత్యం కార్యకర్తలకు, ప్రజలకు అందుబాటులో ఉండాలన్నారు.
తప్పనిసరిగా జమిలి ఎన్నికలు వస్తాయని ఈ జమిలి ఎన్నికలు 2027 వ సంవత్సరంలోనే జరుగుతాయని విజయసాయి రెడ్డి ధీమా వ్యక్తం చేశారు.2027 ఎన్నికలకు అందరం సిద్ధంగా ఉండాలి. మహిళలకు 33 శాతం రిజర్వేషన్లను వస్తాయి..అసెంబ్లీ, ఎంపీ స్థానాలు పెరుగుతాయి.. మూడు స్థానాల్లో ఒక స్థానం మహిళకు వస్తుంది.మహిళలకు వైఎస్ జగన్ తగిన ప్రాధాన్యం ఇస్తారు. ఇక నాకు విశాఖ నుంచి పోటీ చేసే ఆలోచన లేదని పార్టీ గెలవడమే తన ప్రధాన లక్ష్యం అంటూ విజయసాయిరెడ్డి తెలిపారు. ఇక ఈ ఎన్నికలు జరిగితే కనుక తప్పనిసరిగా వైసీపీదే అధికారం అంటూ ఈ సందర్భంగా ఈయన చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.