ధర్టీ ఇయర్స్ ఫృధ్వీ మరోసారి వైయస్ జగన్ గురించి మాట్లాడారు. ఆయన పాదయాత్రకు వెళ్లి ఇప్పటికే నాలుగైదు సార్లు కలిసిన ఫృద్వీ మరో సారి మీడియా దగ్గర జగన్ పై తనకున్న అభిమానాన్ని చూపుకున్నారు.
పృధ్వీ మాట్లాడుతూ.. వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి కనుక ప్రాణాలు అడిగినా ఇచ్చేంత భక్తుడినని అన్నారు. గురువారం ఆయన విజయవాడ కనక దుర్గమ్మను దర్శించుకున్న సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు.
ఫృద్వీ మాట్లాడుతూ…. వైసీపీ వస్తే అధికారుల దౌర్జన్యాలు ఉండవని అన్నారు. ‘రాబోయే కాలానికి కాబోయే ముఖ్యమంత్రి జగనే. రాబోయే ఎన్నికల అనంతరం రెడ్ లైట్ పెట్టుకొని టెంపుల్ రావాలని కోరుతున్నా. వాలంటీర్ల సేవలు అమోఘం, అమ్మవారు వారినే దీవిస్తుంది.’ అని అన్నారు.