ఇప్పట్లో దర్శకత్వం చేసే ఆలోచన లేదు.. పవన్ కళ్యాణ్ మాటలకి గూస్ బంప్స్ వచ్చేసాయి!

గ్లోబ‌ల్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ క‌థానాయ‌కుడిగా స్టార్ డైరెక్ట‌ర్ శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన భారీ బ‌డ్జెట్ చిత్రం ‘గేమ్ చేంజర్’. ఈ చిత్రంలో రామ్ చరణ్ సరసన కియారా అద్వాణీ హీరోయిన్‌గా నటించారు. తెలుగు, త‌మిళ‌, హిందీ భాష‌ల్లో ఈ మూవీ జ‌న‌వ‌రి 10న ప్ర‌పంచ వ్యాప్తంగా రిలీజ్ అవుతోంది. ఈ క్రమంలో శనివారం రాజమండ్రిలో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గెస్ట్ గా వచ్చారు. సినిమా గురించి అందులోని నటీనటులను గురించి మాట్లాడుతూ సూర్య గురించి కూడా మాట్లాడుతూ తెగ పొగిడేసారు పవన్ కళ్యాణ్.

దగ్గరికి పిలిచి హగ్ కూడా ఇచ్చారు. ఈ విషయంపై ఎస్ జె సూర్య స్పందించారు.మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఈవెంట్‌కు రావడం, వచ్చి నా గురించి అలా మాట్లాడుతూ ఉంటే నాకు గూస్ బంప్స్ వచ్చాయి. అసలు నోట మాట రాలేదు. ఆయన్ను హత్తుకున్నప్పుడు తెలియని ఆనందం కలిగింది. ఖుషి సినిమా తీస్తున్నప్పుడు ఎలా ఉన్నారో ఇప్పుడు కూడా అలాగే ఉన్నారు. అప్పట్లోనే ఆయన ఐడియాలజీ చెప్పేవారు.

కానీ నాకు పెద్దగా అర్థమయ్యేది కాదు కానీ ఇప్పటికీ అయినా అదే ఐడియాలజీతో వర్క్ చేస్తున్నారు అని తన ఆనందాన్ని వ్యక్తం చేశాడు సూర్య ఇక డైరెక్షన్ గురించిన ప్రశ్న తలెత్తగా నటుడిగా ఇప్పుడు నేను కంఫర్ట్ గా ఉన్నానని ఇప్పట్లో డైరెక్షన్ చేసే ఆలోచన లేదని చెప్పాడు.అకిరా నందన్‌ను ఫ్లైట్‌లో చూశాను. పవన్ కళ్యాణ్ గారిలాగే పుస్తకాలు పట్టుకుని చదువుకుంటున్నాడు. ఇక ఖుషి 2 గతంలో పవన్ తో అనుకున్నా కానీ కుదరలేదు.

ఒక వేళ ఆ దేవుడు ఛాన్స్ ఇస్తే, టైం కలిసి వస్తే అకిరాతో జరుగుతుందేమో చూడాలి అన్నారు సూర్య.చరణ్ గురించి మాట్లాడుతూ.. ఆయన చాలా వినయంగా ఉంటారు.సినిమాలో ఐఏఎస్ ఆఫీసర్‌గా హుందాగా కనిపిస్తారు. అప్పన్న పాత్రలో చరణ్ అద్భుతంగా నటించారు అని తెలిపారు. ఇంకా దర్శకుడు గురించి సహనటీ నటులు గురించి, నిర్మాత గురించి కూడా మాట్లాడుతూ సినిమా ఇండస్ట్రీ హిట్ కొడుతుందని ఆశాభావాన్ని కూడా వ్యక్తం చేశారు ఎస్ జె సూర్య.